పుణె ఆటో డ్రైవర్‌ కథనంపై స్పందించిన వికాస్‌ ఖన్నా

19 May, 2020 16:06 IST|Sakshi

లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలకు సెలబ్రిటీ చెఫ్‌ వికాస్‌ ఖన్నా తన వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 79 నగరాల్లోని అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రామలకు ఉచితంగా నిత్యవసరాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న పలు వెబ్‌సైట్లలో వచ్చిన పుణె ఆటో డ్రైవర్ అక్షయ్‌ కొథవాలె కథనం వికాస్‌ ఖన్నాను ఆకర్షించింది. దాంతో ‘ఈ ఆటో డ్రైవర్‌ చేస్తోన్న పని నాకు చాలా నచ్చింది. నా తరఫున కొంత సాయం చేసి అతడికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను. నాకు అతని వివరాలు ఇవ్వండి’ అంటూ ట్విట్టర్‌ వేదికగా కోరారు. తన ఈ - మెయిల్‌ ఐడీ కూడా ఇచ్చారు వికాస్‌ ఖన్నా. కొద్ది రోజుల క్రితం తనకు దిబ్బ రొట్టె చేయడం నేర్పిన మాస్టర్‌​ చెఫ్‌ సత్యం వివరాలు తెలపాల్సిందిగా నెటిజన్లును కోరారు వికాస్‌ ఖన్నా. వారు స్పందించి సత్యం వివరాలను రీట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.‌(‘దిబ్బరొట్టె చేయడం నేర్పినందుకు గురుదక్షిణ’)
 

ఇక అక్షయ్‌ విషయానికి వస్తే ఈ నెల 25 అతడి వివాహం జరగాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వివాహం వాయిదా పడింది. దాంతో పెళ్లి కోసం తను దాచిన డబ్బును పేదల ఆకలి తీర్చడం కోసం వినియోగిస్తూ.. మానవత్వం చాటుకుంటున్నాడు. ఓ ఆటో డ్రైవర్‌కు 2లక్షల రూపాయలు అంటే పెద్ద మొత్తమే. అయినా అక్షయ్‌ ఆ సొమ్మును పేదల కోసం వినియోగించడంతో అతడి మంచి మనసుని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ్‌ చేస్తున్న మంచి పనికి వికాస్‌ ఖన్నా కూడా ఫిదా అయ్యాడు. (కరోనా ఎఫెక్ట్‌: డ్రైవరన్నా.. నీకు సలామ్‌)

మరిన్ని వార్తలు