వైరల్‌ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!

14 May, 2019 20:34 IST|Sakshi

న్యూఢిల్లీ : పీడిత ప్రజల బాగుకోసం స్వతంత్ర భారతంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు సమాజంలో అంతరాలు పెంచాయనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. 69 ఏళ్ల గణతంత్ర భారతంలో రిజర్వేషన్లు ఇంకా అవసరమా అని కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదంటున్నారు. అయితే, నేటి ఆధునిక కాలంలోనూ మనదేశంలో కులం గోడలు బలంగా నిలబడడానికి రిజర్వేషన్లే కారణమంటూ ఓ యువతి బూతు పురాణం అందుకుంది. దళితులపై అసభ్యకర రీతిలో విరుచుకుపడింది.

అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని కావడంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని చెప్పుకొచ్చింది. రిజర్వేషన్ల పుణ్యమానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలు తక్కువ మార్కులకే ఉద్యోగాలు తన్నుకు పోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. గవర్నమెంటు కొలువు దక్కాలంటే.. ఆ.....(అసభ్య పదజాలం) కులంలో పుట్టాలా..? అని ప్రశ్నించింది. మార్కులు సరిగా రాకున్నా.. రిజర్వేషన్ల ఫలితంగా.. ఆ.... (అసభ్య పదజాలం) కులస్తులు తమ తలపై (టాప్‌ పొజిషన్) కూర్చుకుంటున్నారని మండిపడింది. రాజకీయంగా తనకు ప్రధాని మోదీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. 40 సెకన్ల ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక వీడియో చివర్లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పైనా ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
దళితులపై మండిపడిన యువతి

మరిన్ని వార్తలు