వైరల్‌ : కుక్క కోసం కొండచిలువతో పోరాటం

28 Sep, 2019 15:28 IST|Sakshi

‘ఇక నా పని అయిపోయింది. ‘కుక్క చావు’ చావాల్సిందే. ఈ రోజుతో నా జీవితం ముగుస్తుంది. ఆ కొండ చిలువకు ఆహారంగా మారాల్సిందే’  అని అనుకుంది కొండ చిలువ నోటికి చిక్కిన ఓ కుక్క. ఇంతలో ముగ్గురు కుర్రాళ్లు కనిపించారు. వచ్చారు.. వచ్చారు.. నా వాళ్లు వచ్చారు. ఇక నువ్వు నన్నేం చేయలేవు అంటూ గంభీర ముఖంతో పాము వైపు చూసింది.

‘నీ వాళ్లు వస్తే నాకేంటే.. నా పట్టు విడిపించడం అంత వీజీ కాదు. నాతో పెట్టుకునే ధైర్యం వాళ్లకు లేదు. నా దగ్గర వచ్చేంత సాహసం చెయ్యలేరు’ అంటూ తన పట్టును మరింత బిగించింది ఆ కొండ చిలువ. కానీ కొండ చిలువ ఆశ అడియాశలు అయ్యాయి. కుక్క బతికింది. కుర్రాళ్లు హీరోలయ్యారు.  వారు చేసిన సాహసం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారులను నెటింజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు. ఏ జంకు బెదురు లేకుండా కొండచిలువపై దాడి చేసి కుక్కను రక్షించారు.

కుక్కను విడిపించడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. తమ చేతికి దొరికిన వాటిని కొండ చిలువపై విసురుతూ.. రాళ్లతో కొడుతూ, దైర్య సాహసాలు ప్రదర్శించారు. అప్పటకీ కొండ చిలువ కుక్కను విడవకపోవడంతో చిన్నారులు మరింతగా ప్రయత్నించారు. ఒకరు తోకను పట్టుకుంటే , మరొకరు కొండ చిలువ తలను పట్టుకున్నాడు. ఇంకొకరు కుక్కను జాగ్రత్తగా విడదీశారు. చివరికి ఎలాగోలా ప్రయత్నించి కుక్కను విడిపించారు. కుక్క అక్కడి నుంచి కుయ్యో.. మెర్రో.. అనుకుంటూ పరుగు పెట్టింది. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ముగ్గురు కుర్రాళ్ల సాహసంపై నెటిజన్లు ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. రియల్‌ హీరోలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా