డబ్బుల్లేకున్నా.. షాపింగ్‌ చేయొచ్చట

9 May, 2019 16:14 IST|Sakshi

ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో ఆఫర్లు ఊరిస్తుంటాయి. కానీ ఎకౌంట్‌లో ఫండ్స్‌ చూస్తే.. సారీ ఈ రోజు కాదు అంటాయి. అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఓ వైపు నచ్చిన వస్తువు తక్కువ ధరకే ఊరిస్తుంటే.. మరోవైపు బ్యాంక్‌ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్‌ కనిపించి తెగ బాధపెడుతుంది. అలాంటప్పుడు డబ్బులతో పని లేకుండా షాపింగ్‌ చేసే అవకాశం లభిస్తే ఎలా ఉంటుంది. ఎగిరి గంతేస్తాం. కానీ అదేలా సాధ్యం అనుకుంటున్నారా. అయితే ఒక సారి ఈ టిక్‌టాక్‌ వీడియో చూడండి. మీకే అర్థం అవుతుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ వీడియోలో ఈ సమస్యకు.. పరిష్కారం చూపించాడో యువకుడు.

‘వెబ్‌డెవలప్‌మెంట్‌కు సంబంధించి టిక్‌టాక్‌లో ఇంతవరకూ ఒక్క వీడియోను కూడా చూడలేదు.. అయితే దీని గురించి నేనేం నిరాశ చెందటం లేదు’ అనే మాటలతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. తర్వాత ఆ వ్యక్తి తన బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేయగా.. జీరో బ్యాలెన్స్‌గా చూపిస్తుంది. తర్వాత ఆ వ్యక్తి తన బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించి వెబ్‌పేజ్‌ ఒపెన్‌ చేసి.. బ్యాక్‌ఎండ్‌కి వెళ్లి ఎమౌంట్‌ దగ్గర తనకు కావాల్సినంత సొమ్ము యాడ్‌ చేస్తాడు. తర్వాత ఆన్‌లైన్‌లో తనకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తాడు. వీడియో ప్రారంభంలో హూడీతో కనపడిన వ‍్యక్తి చివర్లో తలపై స్కార్ఫ్‌ ధరించి ఉండటం మనం గమనించవచ్చు.

ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు రెస్పాన్స్‌ మామూలుగా లేదు. ఇలా చేయడానికి వీలవుతుందో లేదో తెలీదు గానీ నెటిజన్లు మాత్రం దీన్ని తెగ్‌ లైక్‌ చేస్తున్నారు. వీరి వరస చూస్తే ఓ తెలుగు సిమాలో బ్రహ్మానందం.. ‘ఈ టెక్నిక్‌ తెలీక ఇన్నేళ్ల నుంచి అనవసరంగా ఎన్ని షూస్‌ డబ్బులిచ్చి కొన్నానో మాష్టారు’ అనే డైలాగ్‌ గుర్తొస్తుంది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు