వైరల్‌ వీడియో : ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు

17 Apr, 2019 11:28 IST|Sakshi

బీజింగ్‌ : తోబుట్టువుల మధ్య పోట్లాట అనేది సహజం. ప్రతీ విషయానికి గొడవపడటం.. కొట్టుకోవటం కూడా కామనే. ఇదంతా బయట అంటే వారు పుట్టాక జరుగుతుంది. కానీ ఈ వీడియో చూస్తే.. తల్లి గర్భంలోనే ఈ తగదా ప్రారంభమవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా నెలలు కూడా నిండని ఇద్దరు కవలలు అమ్మ పొట్టలోనే కిక్‌బాక్సింగ్‌ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ కవల పిండాల దెబ్బలాటకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. చైనాకు చెందిన ఓ మహిళ నాలుగో నెలల గర్భంతో ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేశారు.

ఈ సమయంలో ఆమె గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు ఒకరితో ఒకరు ఫైటింగ్‌ చేస్తూ కనబడ్డారు. అక్కడే ఉన్న ఆమె భర్త దీన్నంతా వీడియో తీశాడు. అనంతరం దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవ్వడమే కాక అనేక ప్రశంసలు అందుకుంటుంది. ‘తల్లి గర్భంలోనే ఇలా పోట్లాడుకుంటున్నారు.. ఇక బయటకు వచ్చాక ఇంకెంత తన్నుకుంటారో’.. ‘ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌ : వీడియో చూస్తూ.. అలా ఉండిపోతారంతే..!

ఇజ్రాయెల్‌ సంస్థను నిషేధించిన ఫేస్‌బుక్‌

ఈ ఫొటోలో చిరుత ఎక్కడుందో గుర్తు పట్టగలరా?

తప్పు చేశాం.. క్షమించండి..!

జగన్నాథం.. ఏంటీ పని?

పడిపోయా; అయ్యో నిజంగానే పడిపోయావా!!

గరం గరం వడ సాంబార్‌.. తింటే షాక్‌..!

ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్‌ గరుడ శివాజీ ఎక్కడ?

‘ఆఫ్రిదికి, సలాహ్‌కు ఉన్న తేడా ఇదే’

పిడకలపై రివ్యూలు.. నవ్వులే నవ్వులు

వైరల్‌ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!

కూతురు హోం వర్క్‌ కోసం కుక్కకు ట్రైనింగ్‌

ఎమ్మెల్యే తండ్రి.. ఎంతో నిరాడంబరుడు

మరోసారి సోషల్‌ మీడియాపై తాత్కాలిక నిషేధం

రాబర్ట్‌ వాద్రాపై మండిపడ్డ నెటిజన్లు..!

ఆ అధికారిణి ఎవరో తెలిసిపోయింది

వైరల్‌ : హార్ట్‌ బ్రేకింగ్‌ వీడియో..!

దుమ్మురేపుతున్న మోనాలిసా డ్యాన్స్‌ వీడియో

బుడ్డోడి జనగణమన.. వైరల్‌ వీడియో

‘వీడిని తాకట్టు పెట్టుకోండి; రేటు ఎంత?’

మెగా టోర్నీ మొదలు కావడానికి ముందే!!

‘60 శాతం స్కోర్‌ చేశావ్‌.. చాలా గర్వంగా ఉంది’

ధోనీ.. నీ కూతుర్ని కిడ్నాప్‌ చేస్తా ..!

డబ్బుల్లేకున్నా.. షాపింగ్‌ చేయొచ్చట

మరో నకిలీ వీడియో హల్‌చల్‌!

భయానక అనుభవం; ఆక్టోపస్‌ను తిందామనుకుంటే..

వైరల్‌ : డోర్‌బెల్‌ దగ్గర అనుకోని అతిథి..!

‘నీ కష్టాన్ని, సంతోషాన్ని దేనితో పోల్చలేం’

అమ్మాయిలు.. ఒక్క సారి ధైర్యం చేయ్యండి

మరో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ తరహా సినిమాలో త్రిష రాణించేనా!

సంక్రాంతికి ఇండియన్‌–2

అమ్మతో గొడవపడ్డ సమంత!

దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడే :మహేష్‌బాబు

రత్నంలాంటి నటుడు

కాన్స్‌లో మన క్వీన్స్‌