‘కరోనా అంటే భయం పోయినట్లుంది’

8 Jun, 2020 09:51 IST|Sakshi

ముంబై: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల ప్రారంభం నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక​ కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటకి మే 31 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం సైక్లింగ్‌, రన్నింగ్‌, జాగింగ్‌ వంటి వ్యాయమాలకు సడలింపులు ఇచ్చింది. దాంతో మెరైన్‌ డ్రైవ్‌‌ వద్ద జనాలు గుంపులు, గుంపులుగా చేరారు. మాస్క్‌ ధరించారు కానీ సామాజిక దూరం పాటించలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నిహారికా కులకర్ణి ఈ ఫోటోని షేర్ చేశారు. ‘అన్‌లాకింగ్ మొదటి దశలో భాగంగా జూన్ 3 నుంచి ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ కార్యకలాపాలు అనుమతించారు. జూన్ 6, 2020 సాయంత్రం మెరైన్ డ్రైవ్‌లో భారీగా జనం గుమిగూడారు’ అంటూ ఈ ఫోటోని షేర్‌ చేశారు.
 

Huge crowd at Marine drive in the evening. June 6, 2020. In phase 1 of unlocking, outdoor physical activities have been allowed across the state from June 3 from 5 am to 7 pm. #MarineDrive #Phase1 #unlocking1.0 #lockdown5.0 #mumbai #everydaymumbai #everydayeverywhere #indiapictures #thingstodoinmumbai #instagram #instadaily #everydayindia #india_gram #india_ig #indiaclicks #indianphotography #desi_diaries #photojournalism #gettyimages #reportagespotlight #mymumbai #insta_maharashtra #myhallaphoto #storiesofindia #_soi

A post shared by Niharika kulkarni (@niharika_kulkarni) on

దీనిపై నెటిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా’.. ‘మాస్క్‌ కూడా సరిగా వేసుకోని ఈ జనాలు ఇళ్లకు వెళ్లి కరోనా గురించి లెక్చర్లు దంచుతారు’.. ‘మెరైన్‌ డ్రైవ్‌ పేరును కరోనా డ్రైవ్‌గా  మార్చాలి’.. ‘కరోనా గిరోనా జాన్తా నై’’ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు