ఫాదర్‌ పాలు దొంగిలించిన పిల్లి

10 Jul, 2020 18:14 IST|Sakshi

పిల్లి పాలు తాగడం చాలా సాధారణమైన అంశం. కానీ ప్రస్తుతం ఓ పిల్లి పాలు తాగుతున్న వీడియో మాత్రం ప్రపంచం అంతా చక్కర్లు కొడతూ తెగ వైరలవ్వడమే కాక పిల్లిని.. దాని యజమానిని ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసింది. కాంటర్బరీ కేథడ్రాల్ ఉదయం ప్రార్థనల లైవ్ స్ట్రీమ్ సెషన్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. డీన్‌ లైవ్‌లో తన ఉపన్యాసాలను చదువుతుండగా.. ఆయన 13 ఏళ్ల పెంపుడు పిల్లి టైగర్‌ ఎలాంటి జంకు లేకుండా అక్కడకు వచ్చి డీన్‌ పక్కన ఉన్న కుర్చిపై కూర్చుటుంది. అంతటితో ఊరుకోక ఆ పక్కనే టేబుల్‌ మీద డీన్‌ కోసం ఉంచిన పాల వాసనను పసిగడుతుంది. వెంటనే దాని‌ మీదకు దూకి పాలు తాగడం ప్రారంభించింది. ఇది అంతా వీడియోలో రికార్డయ్యింది. టైగర్‌ను గమనించిన డీన్‌.. ‘క్షమించండి ఈ ఉదయం మాకొక స్నేహితుడు దొరికాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. 
 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు