ఓరి దీని వేషాలో.. ఏం గారాలు పోతున్నావే!

9 Sep, 2019 15:39 IST|Sakshi

ఈ వీడియో చూశాకా మీరు కూడా ఈ ఏడాది ఆస్కార్‌ ఉత్తమ నటి/నటుడు అవార్డు ఖచ్చితంగా దీనికే అంటారు. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది ఈ వీడియో చూసి ఇలాగే అనుకున్నారు. ఇక్కడ మనం ఇంతలా చెప్పుకుంటుంది ఓ శునకం గురించి కావడం విశేషం. తన నటనతో ఇంతమందిని ఆకట్టుకోవడమే కాక రెండు రోజుల్లోనే చిన్న సైజు సెలబ్రిటీగా మారింది ఈ కుక్క. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ మహిళ తన పెంపుడు కుక్క గోర్లు కత్తిరించడానికి ప్రయత్నిస్తుంది. దాని కోసం కుక్క కాలిని తన చేతిలోకి తీసుకుని.. కట్టర్‌తో గోర్లు కట్‌ చేయాలని ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్లుండి ఆ కుక్క మూర్ఛబోయినట్లు నటిస్తూ.. నెమ్మదిగా కింద పడింది. కాళ్లు రెండు బార్లా చాపి.. కళ్లు తేలేసింది. మూడు రోజుల క్రితం ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది వీక్షించారు. అద్భుతమైన నటన.. స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇవ్వొచ్చు అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు.

ript>

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు