రణుమొండాల్‌ 2.O వచ్చేసింది!

26 Nov, 2019 16:35 IST|Sakshi

ముంబై: సోషల్‌ మీడియా సెన్సేషన్‌, సింగర్‌ రణు మొండాల్‌ ‘ఏక్‌ ప్యార్‌కా నగ్మా హై’ అనే ఎవర్‌గ్రీన్‌ పాటతో ఒక్కసారిగా రాత్రికిరాత్రే స్టార్‌ సింగర్‌గా మారారు. రైల్వే స్టేషల్‌లో లతా మంగేష్కర్‌ పాడిన పాటలను రణు పాడుకుంటు ఉండగా ఓ ఇంజనీరింగ్‌ విద్యార్ధి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అది చూసిన బాలీవుడ్‌  సంగీత దర్శకుడు ‘హిమేశ్‌ రెష్మియా’ రణుకు తన సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి రణు మొండాల్‌ ఎన్నో పాటలకు కాంట్రాక్టులను దక్కించుకొవడంతో పాటు పలు షోలకు అతిథిగా కూడా హాజరయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే.. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. ఆ  ఏడుగురి మాట అటుంచింతే.. ప్రస్తుతానికి రణు మొండాల్‌ను పోలిన ఓ మహిళ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  

గౌహతికి చెందిన ఓ మహిళా.. రణు పాడిన 'తేరి మేరి కహానీ' అనే సూపర్‌హిట్‌ పాటను ఆమె పాడడంతో వీడియో వైరల్‌గా మారింది. ఆ మహిళా అచ్చం రణుమొండాల్‌ను పోలి ఉండటంతో  పాటు హావభావాలు కూడా ఒకేలా ఉండడంతో నెటిజన్లు ఆమెను ఫన్నీగా రణు మొండాల్‌ 2 అని అభివర్ణిస్తున్నారు. కాని కొందరు మాత్రం డూప్లికేట్‌ సింగర్‌ అని, ఈమెను కూడా స్టార్‌ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

#RanuMondal 2.0 in (Maligaon)Guwahati. #Special Thanks to my friend Tanmoy Dey for shooting and Sharing this vdo. Vdo Rights :- Tanmoy dey #ranumondal #himeshreshammiya

A post shared by Dipankar Baishya (@chiragdipofficial) on

ఇటీవల రణు ముఖానికి మితిమీరిన మేకప్‌ వేసిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో.. రణును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆకతాయిలు నకిలీ ఫోటో సృష్టించారని తెలియడంతో నెటిజన్లు నాలిక కరచుకున్నారు. 

మరిన్ని వార్తలు