వైరల్‌ వీడియో: చిన్న జీతం.. పెద్ద మనసు

15 Apr, 2020 14:28 IST|Sakshi

చిన్న పనిచేసుకుని జీవనం కొనసాగించే ఓ మహిళ తన పెద్ద మనుసును చాటుకుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాలంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న పోలీసులకు తన వంతు సహాయాన్ని అందించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తుని పట్టణంలో నివసించే ఓ మహిళ స్థానికంగా పని చేసుకుంటూ జీవనాన్ని కోనసాగిస్తోంది. ఈ క్రమంలో తమ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తన సొంత డబ్బులతో కూల్‌డ్రింక్స్‌ కొని వారికి అందించింది. రెండు లీటర్ల థమ్సప్‌, ఫాంటాను తీసుకుచ్చి.. ‘మీరు మాకోసం కష్టపడుతున్నారు. మాకు తోచినంత సాయం చేస్తున్నాం.ఇవి తాగండి’  అంటూ పోలీసులకు కూల్‌డ్రింక్స్‌ అందించింది. (కరోనా : తండ్రి ప్రేమ.. కొడుకు కోసం స్పెషల్‌ సూట్‌ )

మహిళ మాటలు విని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. మహిళ పేరు, ఏం చేస్తుంటావని అడగ్గా.. దానికి మహిళ స్థానికంగా ఆయాగా పనిచేస్తున్నానని, తన జీతం మూడు వేల అయిదు వందలని చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తక్కువ జీతం తీసుకుంటున్నప్పటికీ.. మహిళ చేస్తున్న సాయం గొప్పదని, ఆమెది పెద్ద మనసు అని పోలీసులు మహిళను ప్రశంసించారు. అంతేగాకుండా వారి కోసం తీసుకొచ్చిన కూల్‌డ్రింక్స్‌ను ఇంట్లో వాళ్ల  కోసం తీసుకెళ్లామని మహిళకు చెప్పారు. అలాగే రోజు ఒకసారి వచ్చి కనిపించమని, వారికి ధైర్యంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘అమ్మ మనసు బంగారం అంటూ.. గొప్ప మానవత్వాన్ని చాటుకుందని’ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ వీడియోపై హీరో మాధవన్‌ సైతం స్పందించడం విశేషం. (కరోనా కలకలం: క్వారంటైన్‌లోకి సీఎం )

మరిన్ని వార్తలు