వైరల్‌ : ఈ ఏనుగు భలే తెలివైనది!

5 Nov, 2019 13:59 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత తెలివిని ప్రదర్శించే జంతువుల్లో ఏనుగు కూడా ఒకటి. కాలానికి అనుగుణంగా మనుషులతో పోటీ పడుతూ ఏనుగులు కూడా తమ తెలివిని పెంచుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఈ విషయం నిజమేనని తాజాగా ఒక ఏనుగు నిరూపించింది. సఫారీ రైడ్‌లో భాగంగా చాకచక్యంగా వ్యవహరించిన ఏనుగుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సుశాంత నందా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

వీడియోలో.. ఏనుగు తనకు అడ్డుగా ఉన్న పోల్‌ను తొండంతో జాగ్రత్తగా కిందకు నెట్టేసింది. ఇందులో  విశేషమేముంది అనుకుంటున్నారా ! అక్కడే ఉంది అసలు కిటుకు.. ఏనుగు తన తొండంతో తీసిన కంచెకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. జంతువులు తమ సురక్షిత స్థానాలు దాటకుండా అడవిలో ఇటువంటి కంచెలను ఏర్పాటు చేస్తారు. కంచె తీగలకు సౌర విద్యుత్‌ అందిస్తారు. అయితే కంచె దగ్గరకు వచ్చిన సదరు ఏనుగు అవతలి వైపునకు వెళ్లాలని భావించింది. దీంతో ఏం చేయాలా అని ఒక్కక్షణం ఆలోచించి.. తెలివిగా తన తొండంతో చెక్క స్తంభాన్ని గట్టిగా పట్టుకొని కిందకు పడేసింది. తర్వాత చెక్కకు ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలను తాకకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ అవతలి వైపునకు వెళ్లిపోయింది. దీంతో ఈ వీడియోను చూసిన వాళ్లంతా ఈ ఏనుగు చాలా తెలివైందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తలుపు తెరిచి చూసి షాకైంది!

ఓ కూతురి స్పందన ఇది: సీఎం

కరోనా: గొప్ప స్ఫూర్తినిచ్చే వీడియో ఇది!

హ్యాట్సాఫ్‌: 450 కి.మీ. న‌డిచిన పోలీస్‌

ఒక‌వేళ నేను మ‌ర‌ణిస్తే..: డాక్ట‌ర్‌

సినిమా

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి

హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి

కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి 

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

ఇటలీలో మన గాయని