‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

21 Jul, 2019 16:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుతం ట్విటర్‌లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. శారీ ట్విటర్‌ హాష్‌ట్యాగ్‌(#SareeTwitter) కింద ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చీరతో ఉన్న తమ ఫొటోలను ట్విట్ చేస్తూ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. దీంతో శారీ ట్విటర్‌ హాష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది. కాగా, ఈ హ్యాష్‌ట్యాగ్‌తో కూడిన ఓ ట్విట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చీర ధరించన ఓ యువతి క్రికెట్‌ మైదానంలో పరుగెత్తి తన అభిమాన క్రికెటర్‌కు ముద్దు పెట్టారు. ఈ సంఘటన 1975లో జరగ్గా.. శారీ ట్విటర్‌ హాష్‌ట్యాగ్‌ పుణ్యమా అని ఇప్పుడు వైరల్‌ అయింది.

అసలు ఏం జరిగిందంటే..1975లో వెస్టిండీస్, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్రికెటర్ బ్రిజేష్ పటేల్ అద్భుత బ్యాటింగ్‌ చేశాడు. దీంతో ఓ భారత అభిమాని మైదానంలోకి పరిగెత్తి అతడికి ముద్దు పెట్టారు. నల్లటి చీర(బ్లాక్ అండ్‌ వైట్ వీడియోలో కనిపించిన రంగు)లో ఉన్న యువతి పోలీసులు, గ్రౌండ్ సిబ్బందికి చిక్కకుండా పటేల్ వద్దకెళ్లి అతడి బుగ్గ మీద కిస్‌ చేశారు.

చీరలో ఉన్నా కూడా పోలీసులకు చిక్కకుండా స్పీడ్‌గా పరుగెత్తి తన అభిమాన క్రికెటర్‌కు ముద్దు పెట్టారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి.. ఆ వీడియో వైరల్ కాలేదు. అయితే శారీ ట్విటర్‌ హాష్‌ట్యాగ్‌ పుణ్యమా అని ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అయింది. ఇక నెటిజన్లు ఈ ట్వీట్‌పై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. శారీ ట్విటర్‌ హాష్‌ట్యాగ్‌తో పోస్టుచేసిన ఫొటోలు, వీడియోల్లో ఇదే అత్యుత్తమైన ట్వీట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ‘నాకు చీరలోనడవడమే కష్టం కానీ ఆమె ఏకంగా పరుగెత్తారు. ఇది బెస్ట్‌ పోస్ట్‌.’,  ‘చీరలో ఓ మహిళ పెరుగెత్తి అథ్లెటిజంలో కొత్త ఒరవడి సృష్టించారు. ‘వావ్‌.. చీరలో ఇంత స్పీడ్‌గా ఎవరు పరుగెత్తలేరు’ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అన్నా.. గడ్డంతో చాలా అందంగా ఉన్నారు

జలుబు మంచిదే.. ఎందుకంటే!

ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

‘మీ అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు’

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

టీనేజ్‌ అమ్మాయి మొబైల్‌ వాడితే జరిమానా..!

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

మీ బ్యాంకులను అడగండయ్యా..!

మొసలిని మింగిన కొండచిలువ!

ఇలాంటి నాగిని డ్యాన్స్‌ ఎక్కడా చూసి ఉండరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా