ఆమెను చూడగానే అన్ని వదిలేసి వచ్చేశాడు

9 Apr, 2020 15:21 IST|Sakshi

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎవరి తోచినట్లుగా వారు ఇంట్లో ఉండే ఎంజాయ్‌ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే హోం క్వారంటైన్‌లో ఉ‍న్న ఒక మహిళ 25 ఏళ్లనాటి పెళ్లి గౌను వేసుకొని తన భర్తకు సప్రైజ్‌ ఇచ్చింది. వారి పిల్లలు దీన్ని టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. మమ్మీ పెళ్లి గౌను వేసుకున్నప్పుడు డాడీ రియాక్షన్‌ చూడండి అంటూ వారి పిల్లలు ఆ వీడియోను పోస్టు చేశారు. 

ఈ వీడియోలో ఒక మహిళ వారి పెళ్లిరోజు గౌను వేసుకొని ఇంట్లో తిరుగుతూ తన భర్త గది ముందుకు వస్తుంది. అక్కడ జరిగేదంతా వారి పిల్లలు వీడియో తీస్తుంటారు. ఆ సమయంలో  ఆమె భర్త టీవీ చూస్తూ ఉంటాడు. ఆమె అతనిని పిలుస్తుంది. చూసిన వెంటనే అతను ఎంతో ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ నవ్వుతాడు. ఇప్పుడు ఆ నవ్వుకే నెటిజన్లు అందరూ ఫిదా అవుతున్నారు. అలా నవ్విన అతను వెంటనే ఆమె దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆమె  ఈ డ్రస్‌ ఇప్పుడు కూడా నాకు సరిగా సరిపోయింది చూశావా అని అంటుంది. వీడియో చివరిలో​ అతను ఆమెను ముద్దు పెట్టుకొని ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ఇప్పుడు మమ్మల్ని ఫోటో తీయండి అని అడుగుతాడు. ఇప్పటి వరకు ఈ వీడియోకి 1.1 మిలియన్‌ లైక్‌లు, 10,500 కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో  చూసిన ప్రతి ఒక్కరు అన్యోన్యమైన ఆ దంపతుల్ని చూసి అభినందిస్తున్నారు. ఈ వీడియోపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఆమెను చూడగానే అన్ని వదిలేసి వచ్చేశాడు అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా నన్ను మీ ఫోటో తీసుకోనివ్వండి అని ఇంకో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మొత్తానికి అంత అన్యోన్యమైన ఆ దంపతులు వారి పిల్లలు తీసిన వీడియో కారణంగా ఇప్పుడు ఫేమస్‌ అయిపోయారు.  

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా