ప్లాన్‌ అదిరింది.. కుక్కపిల్ల చెడగొట్టింది!

19 Apr, 2020 15:52 IST|Sakshi
వీడియో దృశ్యాలు

మీరు ఈ వీడియోను ప్లే చేయగానే... ఓ యువతి హ్యాండ్‌స్టాండ్‌ చేయటం. ఆ పక్కనే ఓ ముసలాయన చెక్క బల్లపై కూర్చుని పేపర్‌ చదవటం గమనిస్తారు. ఆ యువతి ఎంతో నేర్పుగా విన్యాసాలు చేస్తూ మనతో‘ అరే! భలే చేస్తోందే’ అనిపించుకుంటుంది. ఇంతలో ఓ కుక్కపిల్ల సీనులోకి అడుగుపెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఓ క్షణం మనకు ఏమీ అర్థం కాదు. కుక్కపిల్ల గోడమీద నడవడమేంటి అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరూ చేసిన జిమ్మిక్కు అర్థమై నవ్వొస్తుంది. ఇంతకీ విషయమేంటంటే.. ఆ యువతి హ్యాండ్‌స్టాండ్‌ చేస్తున్నట్టు, ఆ ముసలాయన గోడ దగ్గర బల్ల మీద కూర్చుని పేపర్‌ చదువుతున్నట్లు కెమెరా సహాయంతో మనకు భ్రమ కలిగించారు.

అయితే ఆ ఫ్లోర్‌ మీదకు కుక్క నడుచుకుంటూ రావటంతో వారి ప్లాన్‌ ఫెయిలయింది. వారి ప్లాన్‌ ఫెయిలయినా వీడియో మాత్రం పెద్ద హిట్‌ అయింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు‘‘ స్పైడర్‌ డాగ్‌.. ఆ ముసలాయన కూర్చున్న తీరు, పేపర్‌ చదవటం నిజంగా భ్రమ కలిగించాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు