పక్షులను చూసి నేర్చుకోండి : యువీ

14 Oct, 2019 17:21 IST|Sakshi

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో పలు అసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తు ఉంటారు. తాజాగా ఆయన పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు ప్రాముఖ్యతను తెలియజేసే ఓ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ఒక హంస సముద్రపు ఒడ్డున ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తన నోటితో తీస్తూ ఒక చోట వేస్తుంది. ‘పక్షలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో బాధపడటం చూడటం హృదయ విదారకం. సముద్రాల్లో ప్లాస్టిక్‌ వ‍్యర్థాలు కలిపి కలుషితం చేయడం ఆపేయాలి. ఇప్పుడు వాతావరణ మార్పుపై అవహన చాలా అవసరం. భూగ్రహన్ని ప్లాస్టిక్‌  కాలష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలించాడినికి కొత్త మార్గాలు వెతకాల్సిన సమయం వచ్చింది. అమాయకమైన పక్షులను చూసి పర్యావరణాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడుకునే విషయాలు చాలా నేర్చుకోవచ్చు. మనం ప్లాస్టిక్‌ కాలుష్యానికి కారణం కాకుండా.. నిర్మూలనకు ముందుకు రావాలని’ యువీ పేర్కొన్నారు.

తాజాగా యువీ పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వీడియో పలుసార్లు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టినా.. ప్రస్తుతం యువీ పోస్ట్‌ చేయడంతో దాని ప్రాముఖ్యత పెరిగింది. దీనిపై ‘ప్లాస్టిక్‌ కాలుష్యం బాధాకరం’అంటూ ఒకరు, ‘వాతావరణంలో జరిగే ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని మానవులు పటించుకోరు. కానీ పక్షులు మాత్రం కాలుష్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయని’ మరొకరు, ‘అందమైన భూమిని ప్లాస్టిక్‌ భూతం నుంచి కాపాడుకుందాం’  అంటూ  పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు