అందాలారబోసిన బిందుమాధవి

28 Apr, 2018 07:38 IST|Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానం కోసం చాలా కాలంగా పోరాడుతున్న పదహారణాల తెలుగమ్మాయి నటి బిందుమాదవి. నిజం చెప్పాలంటే పక్కింటి అమ్మాయి ఇలానే ఉంటుంది అనేంతగా కుటుంబ కథా పాత్రల్లో ఇమిడిపోయే నటి ఈ అమ్మడు. ఒకరకంగా అలాంటి ఇమేజ్‌నే బిందుమాధవికి మైనస్‌ అయ్యిందేమో. కేడీబిల్లా కిలాడిరంగా లాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించిన బిందుమాధవికి మార్కెట్‌ పెరగలేదు. అంతే కాదు అవకాశాలు అడపాదడపాగానే వస్తున్నాయి. నటనకు గ్యాప్‌ రావడంతో ఈ చిన్నది ఇటీవల సొంత ఊరు వెళ్లి కుటుంబసభ్యులతో గడపడంతో పాటు అక్కడ పిల్లలతో ఆడి పాడడం, గొర్రెల కాపరిగా అవతారం ఎత్తడం లాంటి పనులు చేశారు.

అంతేకాదు ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి కాస్త ప్రచారం పొందే ప్రయత్నం చేశారు. బిందుమాధవి గొర్రెలను కాస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసినా, అవి పెద్దగా వర్కౌట్‌ అయినట్లు లేదు. దీంతో ఇప్పటి వరకూ మడికట్టుకు కూర్చున్న ఈ జాణ ఇక లాభం లేదని భావించిందో ఏమో అదిరిపోయేలా అందాలారబోత ఫొటోలను తాజాగా ఇంటర్నెట్‌లో విడుదల చేసింది. ఈ ఫొటోలిప్పుడు సోషల్‌మీడియాల్లో వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ ఫొటోలు బిందుమాధవికి గ్లామర్‌ పాత్రలను ఏ మేరకు తీసుకోస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ విక్రమ్‌ప్రభుతో జత కట్టిన పక్కా చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. విశేషం ఏమిటంటే ఇందులోనూ బిందుమాధవి లంగా ఓణి ధరించి పల్లెటూరి భామగానే నటించింది. గ్లామర్‌ కంటూ నటి నిక్కీగల్రాణి ఉందీ చిత్రంలో. మరి పక్కా చిత్రం బిందుమాధవి కెరీర్‌కు ప్లస్‌ అవుతుందా చూద్దాం.

మరిన్ని వార్తలు