న్యూయార్క్‌లో..

10 May, 2018 08:47 IST|Sakshi

తమిళసినిమా: మన హీరోయిన్లు ఆ ఊ అంటే విదేశాలకు చెక్కేస్తున్నారు. అదే మంటే అక్కడ కరాటే నేర్చుకుంటున్నాను. డాన్స్‌లో శిక్షణ పొందుతున్నాను అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్రం చేస్తున్నారు. ఆ మధ్య నటి తమన్నా, అమలాపాల్‌ లాంటి కొందరు ఇలానే చేశారు. తాజాగా నేనేం తక్కువా అన్నట్టు నటి క్యాథరిన్‌ ట్రెసా బయలుదేరింది. అవకాశం ఇవ్వాలే గానీ అందాలారబోతలో తన తడాకా చూపిస్తాననే ఈ బ్యూటీ ఇటీవల కలగప్పు–2 చిత్రంలో అలానే అందాలను సిల్వర్‌స్క్రీన్‌పై పరిచేసింది. అలా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్నా, అవకాశాలు అడపాదడపానే వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రం వరించింది. తమిళంలో విజయ్‌ హీరోగా నటించిన తెరి చిత్రం తెలుగులో రవితేజ హీరోగా రీమేక్‌ కానుంది.

ఇందులో ఒక హీరోయిన్‌గా క్యాథరిన్‌ ట్రెసా నటించనుందట. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ అమ్మడు అమెరికాలోని న్యూయార్క్‌ మహానగరంలో ఉందట. అక్కడ డాన్స్‌లో శిక్షణ పొందుతోంది. ఆ ఫొటోను ఇంటర్నెట్‌లో విడుదల చేసింది. దీని గురించి క్యాథరిన్‌ ట్రెసా తానిప్పుడు అమెరికాలో ఉన్నానని, అక్కడ న్యూయార్క్, బ్రాడ్‌వేలోని బాబింగ్‌ లాగింగ్‌ అనే డాన్స్‌ స్కూల్‌లో శిక్షణ పొందుతున్నట్లు పేర్కొంది. మిస్‌లీ అనే ప్రముఖ శిక్షకురాలు క్యాథరిన్‌ ట్రెసాకు డాన్స్‌లో శిక్షణ ఇస్తోందట. అక్కడ రెండు వారాల డాన్స్‌ శిక్షణను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి రానుందట. ఈ శిక్షణతో ప్రత్యేక డాన్స్‌ మూమెంట్స్‌ను తాను ప్రదర్శించగలనని క్యాథరిన్‌ ట్రెసా అంటోంది.

మరిన్ని వార్తలు