అందులో బీజేపీవారే సిద్ధహస్తులు

27 Mar, 2018 07:15 IST|Sakshi

తమిళసినిమా: ప్రజలను కులాలు, మతాల పేరుతో విభిజించి పాలించడంలో భారతీయ జనతాపార్టీ నాయకులే సిద్ధహస్తులని నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. ఈయన ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్న విషయం తెలిసిందే. త్వరలో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పాలనలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం లింగాయత్తు జాతిని ప్రత్యేక మతంగా ప్రకటించింది.దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల్ని మతాలతో విభజిస్తోందని బీజేపీ  ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ విషయంపై సోమవారం ట్విట్టర్‌లో స్పందించిన నటుడు ప్రకాశ్‌రాజ్‌ జాతి, మతాలతో ప్రజలను విభజించి పాలించడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులని వారు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు.

Read latest South-india News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా