శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

6 Aug, 2019 22:05 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు శంకర్‌ తదుపరి చిత్రం గురించి ఊహాగానాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కమల్‌ హాసన్‌ హీరోగా భారతీయుడు 2ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత శంకర్‌ సముద్రం నేపథ్యంలో ఆక్టోపస్ ప్రధాన పాత్రగా ‌3డి చిత్రం తీయనున్నారనీ, ఫుల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌, సైన్స్‌ ఫిక్షన్‌తో రూపొందబోయే ఈ చిత్రానికి స్క్రిప్టు కూడా లాక్‌ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి‌. విజువల్‌ ఎఫెక్ట్స్​కు అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో సూపర్‌ పవర్స్‌ కలిగిన భారీ సైజు ఆక్టోపస్‌ది కీలక పాత్రట. అందుకోసం మొదట బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ను సంప్రదించగా, ఆయన డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో షారూఖ్‌ను లైన్లో పెట్టినట్టు సమాచారం.

గత చిత్రం రోబో 2.0లో అక్షయ్‌కుమార్‌ను పక్షిరాజుగా చూపెట్టిన శంకర్‌ అక్టోపస్‌ క్యారెక్టర్‌ను దాన్ని మించి ఉండేలా డిజైన్‌ చేశారంట. ఈ సినిమాలో మరికొన్ని పాత్రల కోసం జాకీచాన్‌, తమిళ నటుడు విజయ్‌, చైనీస్‌ నటి లీ బింగ్‌ బింగ్‌లను కూడా సంప్రదించారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. రోబో 2ను మించిన బడ్జెట్‌ అవసరమవడంతో ఈ చిత్రం నిర్మాణం కోసం ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థల్ని సంప్రదిస్తున్నాడంట శంకర్‌. అయితే ఇవన్నీ ఊహాగానాలే. శంకర్‌ నుంచి గానీ, షారూక్‌ నుంచి గానీ ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. అసలు విషయం ఏంటన్నది తెలుసుకోవాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. 

Read latest South-india News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

రికార్డ్‌ సృష్టించిన ‘నే జా’

‘చేతిలో డబ్బు లేదు...గుండె పగిలేలా ఏడ్చా’

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

చట్రంలో చిక్కిపోతున్నారు!

స్టార్ హీరోయిన్‌కి ‘బిగ్‌బాస్‌’ కష్టాలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?

హాలీవుడ్‌కి హలో

ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

అన్నపూర్ణమ్మ మనవడు

ట్రైలర్‌ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది

నిశ్శబ్దంగా పూర్తయింది

ప్రతి క్షణమూ పోరాటమే

ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు

వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది

మూడు రోజుల్లో స్టెప్‌ ఇన్‌

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!