శ్రియ షాకింగ్‌ న్యూస్‌

3 Apr, 2018 09:59 IST|Sakshi
శ్రియ, ఆండ్రోవ్‌ కోస్‌చేవ్‌ పెళ్లి ఫొటో

సాక్షి, సినిమా: నటి శ్రియ తన అభిమానులకే కాదు, సినీ వర్గాలకు షాక్‌ మీద షాక్‌ ఇస్తున్నారు. ఈ ఉత్తరాది బ్యూటీలో మంచి నటి, డాన్సర్‌ ఉన్నారు. అంతకుమించి లక్కున్న నటిగా పేరుపొందారు. కోలీవుడ్‌లో అనతికాలంలోనే స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దృష్టిలో పడి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది శ్రియ. అదే విధంగా తెలుగులోనూ స్టార్‌ హీరోలందరితోనూ నటించేసింది. అలా దశాబ్దానికి పైగా తన అందం, అభియంతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శ్రియ ఇటీవల అతి రహస్యంగా తన చిరకాల ప్రేమికుడు రష్యాకు చెందిన ఆండ్రోవ్‌ కోస్‌చేవ్‌ను ముంబైలో పెళ్లి చేసేసుకుంది.

ఆ తరువాత కొన్ని రోజులకు తమ పెళ్లి ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. శ్రియ, ఆండ్రోవ్‌కోస్‌చేవ్‌ ప్రేమలో పడిందన్న ప్రచారం జోరుగా సాగిందే కానీ, ఇంత సడన్‌గా పెళ్లి చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. శ్రియ పెళ్లి దక్షిణాది చిత్ర పరిశ్రమకు, అభిమానులకు షాక్‌ ఇచ్చే అంశమే. ఇప్పుటికే ఒక తెలుగు చిత్రంలో వెంకటేశ్‌కు జంటగా నటించడానికి అంగీకరించింది. దీంతో శ్రియను దక్షిణాది వెండితెరపై ఇకపై కూడా చూడవచ్చుననుకున్న అభిమానులకు ఆమె మరో షాక్‌ ఇస్తున్నట్లు తాజా సమాచారం.

అవును శ్రియ నటనకు టాటా చెప్పి తన జీవిత భాగస్వామితో కలిసి రష్యాలో మకాం పెట్టడానికి సిద్ధం అవుతోందట. అందుకే వెంకటేశ్‌తో నటించడానికి అంగీకరించిన చిత్రాన్ని వదిలేసుకుందన్న ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదే  నిజం అయితే చిరునవ్వుల చిన్నది శ్రియను ఇక తెరపై చూడలేమన్నమాట.

మరిన్ని వార్తలు