మంత్రి వ్యాఖ్యలపై నటి శ్రీప్రియ సెటైర్లు

10 Apr, 2018 08:37 IST|Sakshi

తమిళసినిమా: రాష్ట్ర సమాచార, ప్రచార శాఖ మంత్రి కడంబూర్‌ రాజూ, కమలహాసన్‌ మక్కల్‌ నీది మయం పార్టీ కార్యకర్త, నటి శ్రీప్రియల మధ్య మాటల యుద్ధం సాగింది. మక్కల్‌ నీది మయం పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత కమలహాసన్‌ ఇటీవల తిరుచ్చిలో బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆ సభకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సమావేశంపై స్పందించిన మంత్రి కడంబూర్‌ రాజు బర్రెల బండితో పోల్చి పరిహాసం చేశారు. ఆయన మాట్లాడుతూ వైగై నదిలో గెదెను కడిగినా జనం పోగవుతారని అన్నారు. అలా నటుడి సభకు జనం రావడం ఆశ్చర్యం ఏమీ లేదు అని పేర్కొన్నారు. దీనికి కమలహాసన్‌ పార్టీ ఉన్నత కమిటీ కార్యకర్త శ్రీప్రియ స్పందిస్తూ మంత్రి కడంబూర్‌ రాజూ ఆయన పార్టీ వారిని నీరులేని కావేరి నదిలో స్నానం చేయించమనండి. వారిని చూడటానికి జనం పోగవుతారు అని వ్యంగ్యాస్త్రాలతో ధీటుగా తన ట్విట్టర్‌లో బదులిచ్చారు.

మరిన్ని వార్తలు