ఈరోజు మ్యాచ్‌ కచ్చితంగా చూడాల్సిందే.. ఎందుకంటే?

7 Feb, 2018 13:48 IST|Sakshi

న్యూల్యాండ్స్‌లో జరిగే వన్డే కోసం ఇటు భారత్‌, అటు దక్షిణాఫ్రికా ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. వరుసగా మూడో వన్డేలో గెలిచి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచాలని భారత్‌ భావిస్తోంది. కనీసం ఈవన్డేలోనైనా గెలిచి సిరీస్‌ రేస్‌లో ఉండాలని సఫారీలు భావిస్తున్నారు.

ఇక ఈ వన్డేపై అందరిలోను ఆసక్తి నెలకొంది. మూడో వన్డేకు పలు అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. అందుకే మ్యాచ్‌ చూడాలని క్రికెట్‌ అభిమానులు ఫిక్సైపోయారు..

మ్యాచ్‌ చూడటానికి పది కారణాలు
1. న్యూల్యాండ్స్‌లో దక్షిణాఫ్రికా విజయ శాతం 84.85. ఇప్పటి వరకూ టెస్టు హోదా ఉన్న ఏ దేశానికి స్వదేశంలో ఇంత చర్రిత లేదు.
2. డుప్లెసిస్‌(185) ఇదే గ్రౌండ్‌లో శ్రీలంకపై గత ఏడాది వ్యక్తిగత అత్యధిక పరుగులు చేశాడు.
3. జింబాంబ్వేకు చెందిన ఒలంగా 2000లో ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్లు తీశాడు. అది అతని కేరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు
4. శిఖర్‌ ధావన్‌ మరో అర్ధసెంచరీ చేస్తే వన్డేల్లో 25 హాఫ్‌ సెంచరీలు పూర్తవుతాయి.
5. డికాక్‌  మరొక్క పరుగు చేస్తే దక్షిణాఫ్రికా తరపున అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడు అవుతాడు.
6. ఈ వన్డేలో 6 క్యాచ్‌లు పడితే ధోని వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కే అవకాశం ఉంది.
7. ధోని పదివేల పరుగులకు 98 పరుగుల దూరంలో ఉన్నాడు. ఒకవేల సెంచరీ చేస్తే 10వేల పరుగులు చేసిన నాలుగవ భారత ఆటగాడు అవుతాడు. సచిన్‌(18,426), గంగూలీ(11,363), రాహుల్‌ ద్రవిడ్‌ (10,899) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
8. భువనేశ్వర్‌ 91 పరుగులు చేస్తే వన్డేల్లో 1000 పరుగుల మార్క్‌ చేరుకుంటాడు.
9. ఇమ్రాన్‌ తాహిర్‌ మరో నాలుగు వికెట్లు తీస్తే స్వదేశంలో జరిగిన వన్డేల్లో 50 వికెట్లు తీసిన తొలి దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ అవుతాడు.
10. విరాట్‌ కోహ్లీ ఇప్పటికి 54 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. మరొక్క సెంచరీ ఇక్కడ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన 5వ క్రికెటర్‌ అవుతాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ..

రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌

‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’

వేలానికి బట్లర్‌ ప్రపంచకప్‌ జెర్సీ

హాకీ ఇండియా, ఏఐఎఫ్‌ఎఫ్‌ విరాళం రూ. 25 లక్షలు

సినిమా

ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

కూతురి శ్ర‌ద్ధాంజ‌లి.. ఓ తండ్రి ఆవేద‌న‌

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌