110 కోట్ల మంది చూశారు 

23 Jun, 2020 00:02 IST|Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌ వీడియో వీక్షకులు

దుబాయ్‌: మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతోందనడానికి తాజా నిదర్శనమిది. ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌ను వివిధ డిజిటల్‌ వీడియో స్ట్రీమింగ్‌ వేదికలపై చూసిన వీక్షకుల సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. దీని ప్రకారం ఈ టోర్నీని మొత్తం 110 కోట్ల మంది వీక్షించారు. 2018 టి20 ప్రపంచకప్‌తో పోలిస్తే ఇది ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇంకా చెప్పాలంటే 2017 మహిళల వన్డే వరల్డ్‌కప్‌తో పోలిస్తే ఈసారి వీడియో వ్యూస్‌ 10 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ రెండు సందర్భాల్లో భారత జట్టు ఫైనల్లో ఆడటం కూడా దీనికి ఒక కారణం. ఓవరాల్‌గా కూడా 2019 పురుషుల వరల్డ్‌కప్‌ తర్వాత ఎక్కువ వ్యూస్‌ వచ్చిన ఐసీసీ ఈవెంట్‌గా ఈ వరల్డ్‌ కప్‌ రెండో స్థానంలో నిలిచింది. నాకౌట్‌ మ్యాచ్‌లలో 2018తో పోలిస్తే ఏకంగా 423 శాతం వ్యూయర్‌షిప్‌ పెరగడం మరో ఘనత.

మరిన్ని వార్తలు