‘1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు’

5 Dec, 2019 12:00 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో తొలి టీ20తో ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భాగవత్‌తో కలిసి హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ‘కొత్తగా ఏర్పడిన హెచ్‌సీఏ నేతృత్వంలో ఇక్కడ ఇది తొలి మ్యాచ్‌. దాదాపు 40  వేల మంది అభిమానులు మ్యాచ్‌ హాజరు కావొచ్చు. 1800 మంది పోలీసులతో మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాం. రేపు బ్లాక్‌ డే కూడా కావడంతో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. ఆక్టోపస్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు, సీసీ కెమెరాలు, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, డాగ్‌ స్క్వాడ్‌ టీం నడుమ భారీ భదత్ర ఉంటుంది.

అభిమానులకు పార్కింగ్‌ సదుపాయం కూడా కలదు. రేపు మెట్రో రైల్‌ సమయం  రాత్రి గం. 1.00ల వరకూ వినియోగించుకోవచ్చు. సిగరెట్లు , ల్యాప్‌ టాప్స్‌, హెల్మెట్లు, కెమెరాలు, మ్యాచ్‌ బాక్స్‌, బైనాకులర్స్‌, బ్యాగ్స్‌, బ్యానర్స్‌, లైటర్స్‌, కాయిన్స్‌, తిండి పదార్ధాలు, పెన్స్‌, ఫర్‌ఫ్యూమ్స్‌ స్టేడియంలోకి నిషేధం. జాతీయ జెండా తప్పా ఇతర ఏ జెండాలు అనుమతించబడవు. షీ టీం బృందాలు  కూడా మహిళల రక్షణ కోసం నియమించాం. స్టేడియం మొత్తం సీసీ కెమెరాలు అధీనంలో ఉంటుంది. ఎవరికీ అసౌకర్యం కల్గినా డయల్‌ 100కి ఫోన్‌ చేయండి’ అని భాగవత్‌, అజహర్‌లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు