మోమినుల్ హక్ సెంచరీ

12 Oct, 2013 01:29 IST|Sakshi
మోమినుల్ హక్ సెంచరీ

చిట్టగాంగ్: యువ బ్యాట్స్‌మన్ మోమినుల్ హక్ (274 బంతుల్లో 181; 27 ఫోర్లు) సెంచరీ సాధించడంతో బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌కు దీటైన జవాబిచ్చింది. ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కేవలం 89 పరుగుల దూరంలోనే నిలిచింది.
 
  మూడో రోజు శుక్రవారం 103/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను మోమినుల్ నడిపించాడు. 77 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట కొనసాగించిన 22 ఏళ్ల హక్ 98 బంతుల్లోనే 18 ఫోర్లతో కెరీర్ తొలి సెంచరీ నమోదు చేశాడు.

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ శైలిని పోలినట్లు ఉండటంతో సహచరులంతా అతన్ని ‘సౌరవ్’గా పిలుచుకుంటారు. కెప్టెన్ ముష్ఫీకర్ రహీం (67) అర్ధసెంచరీ చేయగా, నాసిర్ హొస్సేన్ 46 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి సొహాగ్ గజి (28), అబ్దుర్ రజాక్ (1) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, కొరే అండర్సన్ చెరో 2 వికెట్లు తీశారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు