స్టేడియంలోకి పాములు.. మ్యాచ్‌కు అంతరాయం

5 Jan, 2020 19:46 IST|Sakshi

ముంబై:  ఒక క్రికెట్‌ మ్యాచ్‌ నిలిచిపోయిందంటే ఏ వర్షం కారణంగానో, సరైన వెలుతురు లేని కారణంగానో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక ఆటగాడు గాయపడిన సందర్భాల్లో మ్యాచ్‌కు అంతరాయం కలుగుతూ ఉంటుంది. అయితే పాములు కారణంగా మ్యాచ్‌లు చాలాసేపు ఆగిపోవడం గత కొంతకాలంగా రంజీ మ్యాచ్‌ల్లో జరుగుతూ వస్తోంది. గతేడాది ఆంధ్ర-విదర్భ మ్యాచ్‌లో భాగంగా స్టేడియంలో పాములు రావడంతో కాసేపు ఆగిపోయింది.

తాజాగా ముంబై-కర్ణాటక జట్ల మధ్య జరిగిన మరో రంజీ మ్యాచ్‌లో కూడా పాములు దర్శనమిచ్చాయి. ఆదివారం ఆటలో భాగంగా నగరంలోని బంద్ర కుర్లా కాంప్లెక్స్‌ స్టేడియంలో రెండు పాములు రావడంతో మ్యాచ్‌ చాలాసేపు నిలిచిపోయింది. చివరకు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో వాటిని పట్టుకున్నాడు. ఆపై మ్యాచ్‌ జరగ్గా అందులో కర్ణాటక జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముంబై నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను కర్ణాటక తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కర్ణాటక ఓపెనర్లు ఆర్‌ సమరత్‌(34), దేవ్‌దూత్‌ పడిక్కల్‌(50)లు మ్యాచ్‌కు చక్కటి ఆరంభాన్నిచ్చి కర్ణాటక గెలుపులో సహకరించారు.

మరిన్ని వార్తలు