30 నిమిషాల కామెంటరీ అనుకుంటే..

29 Jun, 2020 12:11 IST|Sakshi

అది 90 నిమిషాలు అయ్యింది

నా  కామెంటరీల్లో అదొక ఫేవరెట్‌

2019 వరల్డ్‌కప్‌ ఫైనల్‌పై స్మిత్‌

వెల్లింగ్టన్‌: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టైటిల్‌ కోసం ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ల మధ్య రసవత్తర పోరు జరగ్గా, అది కామెంటేటర్‌లకు సైతం ఆసక్తిని రేపింది. చివరకు రెండుసార్లు సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో ‘బౌండరీల కౌంట్‌’ నిబంధనతో ఇంగ్లండ్‌ తొలిసారి విజేతగా అవతరించింది. అయితే వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన బ్లాక్‌ క్యాప్స్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. కాగా, ఆ మెగా ఫైనల్‌ జ్ఞాపకాల్ని న్యూజిలాండ్‌ కామెంటేటర్‌ ఇయాన్‌ స్మిత్‌ మరొకసారి గుర్తు చేసుకున్నాడు. తన ఫేవరెట్‌ వ్యాఖ్యానాల్లో గత వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కామెంటరీ కూడా ఒకటన్నాడు. (సెల్ఫ్‌ ఐసోలేషన్‌‌లో ఉంటానని చెప్పి..)

ఆ సమయంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ నాసీర్‌ హుస్సేన్‌, విండీస్‌ దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ బిషన్‌ కామెంటరీ బాక్సులో ఉండగా వారితో ఇయాన్‌ స్మిత్‌ వ్యాఖ్యానం అందించాడు. అయితే ఇయన్‌ స్మిత్‌ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కావడంతో ఆ మ్యాచ్‌ అతనికి కాస్త టెన్షన్‌ వాతావరణాన్ని క్రియేట్‌ చేసింది.  ఇదే విషయాన్ని తాజాగా భారత్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లేతో ఇన్‌సైడ్‌ అవుట్‌ కార్యక్రమంలో  ఇయాన్ తెలిపాడు. ‘ అది నా ఫేవరెట్‌ కామెంటరీల్లో ఒకటి.  గతంలో ఎప్పుడూ చూడని ఫైనల్‌ అది. ఇక ముందు కూడా ఈ తరహా ఫైనల్‌ జరుగుతుందని అనుకోవడం లేదు. నేను కామెంటరీ బాక్సులో కూర్చొని ఉన్నా. ఇంకా ఏడు ఓవర్లు ఉన్నాయి. వాటికి 30 నుంచి 35 నిమిషాలు సమయం పడుతుంది. కానీ ఆ మ్యాచ్‌ 90 నిమిషాలు పాటు జరిగింది. ఆ ఏడు చివరి ఓవర్‌లతో పాటు సూపర్‌ ఓవర్‌లు జరగడంతో 30 నిమిషాల మ్యాచ్‌ కాస్తా 90 నిమిషాలకు వెళ్లింది. ఈ తరహా కామెంటరీ అనేది కాంపిటేషన్‌లా సాగలేదు.. ఒక కాంబినేషన్‌లా సాగిందని ఎప్పుడూ చెబుతూ ఉంటా. మేమంతా ఒక మంచి కామెంటరీని ప్రజలకు ఇవ్వడానికి సాధ్యమైనంతవరకూ కృషి చేశాం’ అని ఇయాన్‌ స్మిత్‌ తెలిపాడు.(రోహిత్‌ను వరల్డ్‌కప్‌లోకి తీసుకోలేకపోవడమే..)

>
మరిన్ని వార్తలు