వచ్చే ఏడాది అక్టోబర్‌లో జాతీయ క్రీడలు

1 Sep, 2019 05:43 IST|Sakshi

న్యూఢిల్లీ: వాయిదా పడుతూ వస్తోన్న 36వ జాతీయ క్రీడల తుది తేదీలను మళ్లీ ఖరారు చేశారు. గోవా ఆతిథ్యమిచ్చే ఈ క్రీడలు వచ్చే ఏడాదిలో అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 4 వరకు జరుగుతాయని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. 2015లో కేరళలో చివరిసారి జాతీయ క్రీడలు జరిగాయి. అనంతరం గోవా వేదికగా 2016లో జాతీయ క్రీడలను నిర్వహించాలి. కానీ ఏర్పాట్లలో జాప్యం కారణంగా మూడేళ్లుగా ఈ క్రీడలను వాయిదా వేస్తూ వస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా