విండీస్‌తో మూడో టీ-20 : అప్‌డేట్స్‌

11 Nov, 2018 19:09 IST|Sakshi

చెన్నై వేదికగా చివరి టీ-20 మ్యాచ్‌

సాక్షి, చెన్నై : భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరగునున్న చివరి టీ-20 మ్యాచ్‌లో విండీస్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఇది వరకే సొంత చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ పలు మార్పులతో బరిలోకి దిగింది. సిరీస్ క్లీన్‌స్వీప్‌ కోసం భారత్‌ ప్రయత్నిస్తుండగా.. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన విండీస్‌ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అప్‌డేట్స్‌ :

  • భారత ఆటగాళ్లు ధావన్‌, పంత్‌లు విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ధావన్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగగా, పంత్‌ కూడా ధాటిగా ఆడుతూ.. స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 52పరుగులు చేయాల్సి ఉంది.
     
  • ధాటిగా ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ థామస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఫోర్లతో చెలరేగిన రాహుల్‌ 10 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
     
  • భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పాల్‌ బౌలింగ్‌లో జౌటయ్యాడు. 2.3 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ ఒక వికెట్‌ కోల్పోయి 13 పరుగులు చేసింది.
     
  • చెన్నైలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. గత రెండు మ్యాచ్‌లను ఓడి సిరీస్‌ కోల్పోయిన విండీస్‌ జట్టు ప్రారంభం నుంచి ధాటిగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓపెనర్‌ ఎస్‌డీ హోప్‌ 24 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్‌ హెట్మెయర్‌ 26 పరుగులకు ఔటయ్యాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన డీఎం బ్రావో ఒకవైపు నిలకడగా ఆడుతుండగా.. నాలుగో స్థానంలో వచ్చిన రామ్‌దిన్‌ 15 పరుగులు చేసి సుందర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ వస్తూనే ధాటిగా ఆడటం ప్రారంభించాడు. మరోవైపు బ్రావో కూడా జోరు పెంచాడు. పూరన్‌ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 25 బంతుల్లో 53 పరుగులు చేయగా.. బ్రావో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి అజేయంగా ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు తీయగా.. సుందర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. చాహల్‌ ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. టీమిండియాకు 182 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
     
  • చెలరేగి ఆడిన విండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ 24 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.
  • ఎన్‌ పూరన్‌, బ్రావో ధాటిగా ఆడుతుండటంతో విండీస్‌ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి కరేబియన్లు మూడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేశారు. ప్రస్తుతం బ్రావో 26 బంతుల్లో 30 పరుగులు, పూరన్‌ 14 బంతుల్లో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.
     
  • మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌.. 15 పరుగులు చేసిన రామ్‌దిన్‌ వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి విండీస్‌ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రావో 15 పరుగులు, ఎన్‌ పూరన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.
     
  • 11 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రేవో 12 పరుగులతో, డీ రామ్‌దిన్‌ ఏడు పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వెస్టిండీస్‌ కోల్పోయిన రెండు వికెట్లను చాహల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.
     
  • 53 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌, హోప్‌ (24) ఔట్‌
  • ఐదు ఓవర్లు ముగిసే లోపు విండీస్‌ స్కోర్‌ : 38/0. హోప్‌ (17), హెట్మేర్ (16)


భారత్‌ జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే, దినేష్‌ కార్తిక్‌, కృనాల్‌ పాండ్యా, సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కలీల్‌, చహల్‌

విండీస్‌ : వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్‌దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్‌వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్.

మరిన్ని వార్తలు