4 గంటల మ్యాచ్‌లు రద్దు!

26 May, 2015 03:22 IST|Sakshi

ఐపీఎల్-8 అన్ని రకాలుగా విజయవంతం అయిందని ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. టోర్నీకి సంబంధించి కొన్ని గణాంకాలు ఆయన వెల్లడించారు. 20 శాతం టీవీ రేటింగ్‌లు, స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య 15 శాతం పెరిగాయని... తొలి ఐపీఎల్‌తో పోలిస్తే ఆదాయం 120 శాతం పెరిగిందన్న ఠాకూర్, ఓవరాల్‌గా 200 కోట్ల మంది ఐపీఎల్ చూశారని వివరించారు. కొత్తగా 16 నగరాల్లో ఈసారి ఏర్పాటు చేసిన ‘ఫ్యాన్ పార్క్’ సిస్టం కూడా విజయవంతమైందని, గుంటూరులో 20 వేల మంది చూశారని ఠాకూర్ చెప్పారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఐపీఎల్‌లో దాదాపు ప్రతీ చోటా మ్యాచ్‌లు చూశారని, భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్ల లీగ్ ప్రదర్శనపై కూడా వారు ఓ కన్నేసి ఉంచారని గుర్తు చేశారు. కొన్ని మ్యాచ్ ఫలితాలపై ఈడీ దృష్టి పెట్టిందనడంలో వాస్తవం లేదని, ఒకే ఒక ఆటగాడిని బుకీలు సంప్రదిస్తే అతను వెంటనే ఏసీయూకు సమాచారం అందించాడని ఆయన చెప్పారు. ఐపీఎల్‌లో 4 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌ల రద్దు, అన్‌క్యాప్డ్ ప్లేయర్ల గురించి చర్చ జరిగిందని, వీటిపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని ఆయన చెప్పారు.
 

మరిన్ని వార్తలు