పట్టు బిగించిన కోహ్లి సేన.. భారీగా ఆధిక్యం!

24 Sep, 2016 19:46 IST|Sakshi
పట్టు బిగించిన కోహ్లి సేన.. భారీగా ఆధిక్యం!

కాన్పూర్: చరిత్రాత్మక 500 వ టెస్టు మ్యాచ్లో మూడో రోజైన శనివారం టీం ఇండియా సత్తా చాటింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి  ఒక వికెట్‌కు 152 పరుగులతో బలంగా కనిపించిన కివీస్‌ జట్టు.. మూడో రోజు చేతులెత్తేసింది. స్విన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలు చెలరేగి చెరో నాలుగు వికెట్లు తీయడంతో.. కివీస్ మరో 110 పరుగులు మాత్రమే జోడించి 262 పరుగులకే ఆలౌవుట్ అయింది.

ఇక రెండో ఇన్సింగ్లో బరిలోకి దిగిన భారత్‌ మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడి 50 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అతను ఔటైనా.. మురళీ విజయ్ (64), ఛటేశ్వర్ పుజారా(50) జోరుగా ఆడుతూ మరో వికెట్‌ పడకుండా చూశారు. మొత్తానికి టీం ఇండియా కివీస్‌ జట్టుపై 215  పరుగుల ఆధిక్యంతో ఉంది.

మూడో రోజు ఆటలో లాథమ్ (58) అవుట్ అయిన తర్వాత కివీస్ పతనం ప్రారంభమైంది. రాస్ టేలర్ డకౌట్ కాగా, కెప్టెన్ విలియమ్స్(75), ల్యూకో రోంచి(38), సాంట్నార్(32), వాట్లింగ్(21)  మోస్తరుగా ఆడారు. చివరి ముగ్గురు బ్యాట్స్ మెన్స్ డకౌట్ అయ్యారు. దీంతో భారత జట్టుకు 56 పరుగుల ఆధిక్యం లభించింది. మొదటి ఇన్సింగ్ లో టీం ఇండియా 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


 

మరిన్ని వార్తలు