‘కంగారు’పడ్డారు!

19 Mar, 2016 00:46 IST|Sakshi
‘కంగారు’పడ్డారు!

లక్ష్య ఛేదనలో తడబడ్డ ఆస్ట్రేలియా
8 పరుగులతో నెగ్గిన న్యూజిలాండ్
రాణించిన కివీస్ బౌలర్లు

 
ధర్మశాల: ఆస్ట్రేలియా లక్ష్యం 20 ఓవర్లలో 143 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 121/5... ఇక గెలవాలంటే 12 బంతుల్లో 22 పరుగులు చేయాలి. మామూలుగా ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను బట్టి చూస్తే విజయం నల్లేరు మీద నడకే. కానీ న్యూజిలాండ్ పేసర్లు మెక్లీంగన్ (3/17), అండర్సన్ (2/29) సూపర్ బౌలింగ్‌తో కంగారూలను అద్భుతంగా కట్టడి చేశారు. 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి స్మిత్‌సేన విజయాన్ని అడ్డుకున్నారు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో కివీస్ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. గప్టిల్ (27 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇలియట్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు), విలియమ్సన్ (20 బంతుల్లో 24; 4 ఫోర్లు), మున్రో (26 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులకే పరిమితమైంది. ఖవాజ (27 బంతుల్లో 38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. చివర్లో 12 బంతుల వ్యవధిలో మార్ష్(24), అగర్(9), ఫాల్క్‌నర్ (2), కోల్టర్‌నీల్ (1)లు అవుట్ కావడంతో కివీస్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మెక్లీంగన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.   

 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 39; విలియమ్సన్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 24; మున్రో (సి) ఫాల్క్‌నర్ (బి) మార్ష్ 23; అండర్సన్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 3; టేలర్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 11; ఇలియట్ రనౌట్ 27; రోంచి (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 6; సాంట్నెర్ రనౌట్ 1; మిల్నె నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 142.

 వికెట్ల పతనం: 1-61; 2-66; 3-76; 4-97; 5-117; 6-133; 7-140; 8-142.
బౌలింగ్: కోల్టర్‌నీల్ 4-0-33-0; వాట్సన్ 4-0-22-1; అగర్ 1-0-18-0; ఫాల్క్‌నర్ 3-0-18-2; జంపా 1-0-3-0; మ్యాక్స్‌వెల్ 3-0-18-2; మిచెల్ మార్ష్ 4-0-26-1.

 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజ రనౌట్ 38; వాట్సన్ (సి) విలియమ్సన్ (బి) మెక్లీంగన్ 13; స్మిత్ (స్టంప్డ్) రోంచి (బి) సాంట్నెర్ 6; వార్నర్ (సి) గప్టిల్ (బి) సాంట్నెర్ 6; మ్యాక్స్‌వెల్ (సి) విలియమ్సన్ (బి) సోధి 22; మార్ష్ (సి) మిల్నె (బి) మెక్లీంగన్ 24; అగర్ (సి) టేలర్ (బి) మెక్లీంగన్ 9; ఫాల్క్‌నర్ (సి) గప్టిల్ (బి) అండర్సన్ 2; కోల్టర్‌నీల్ (బి) అండర్సన్ 1; నెవిల్ నాటౌట్ 7; జంపా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134.
వికెట్ల పతనం: 1-44; 2-51; 3-62; 4-66; 5-100; 6-121; 7-123; 8-124; 9-132.
బౌలింగ్: అండర్సన్ 4-0-29-2; మిల్నె 2-0-22-0; ఇలియట్ 2-0-17-0; మెక్లీంగన్ 3-0-17-3; సాంట్నెర్ 4-0-30-2; విలియమ్సన్ 1-0-3-0; సోధి 4-0-14-1.
 
 కివీస్ మహిళలు కూడా...
మరోవైపు న్యూజిలాండ్ మహిళల జట్టు కూడా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 93 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత కివీస్ మూడు వికెట్లకు 177 పరుగులు చేయగా... ఐర్లాండ్ 83 పరుగులు మాత్రమే సాధించింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. 103 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది.

>
మరిన్ని వార్తలు