‘ఐదు'లోనూ అదరగొట్టారు

17 Nov, 2014 01:13 IST|Sakshi
‘ఐదు'లోనూ అదరగొట్టారు

రాంచీ: వేదిక మారినా... కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినా... భారత జట్టు తమ జోరును కొనసాగించింది. శ్రీలంకపై చివరిదైన ఐదో వన్డేలో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్ల పోరుగా నిలిచిన ఆఖరి వన్డేలో విరాట్ కోహ్లి (126 బంతుల్లో 139 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు. ఫలితంగా శ్రీలంక జట్టు తొలిసారి ఓ సిరీస్‌ను 0-5తో కోల్పోయింది.

 జేఎస్‌సీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. కెప్టెన్ మ్యాథ్యూస్ (116 బంతుల్లో 139 నాటౌట్; 6 ఫోర్లు, 10 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 85 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో మ్యాథ్యూస్, తిరిమన్నే ఐదో వికెట్‌కు 128 పరుగులు జోడించి ఆదుకున్నారు.  

 తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 7 వికెట్లకు 288 పరుగులు చేసింది. కోహ్లికి తోడుగా రాయుడు (69 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. 14 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్‌ను వీరిద్దరు మూడో వికెట్‌కు 136 పరుగులు జోడించి నిలబెట్టారు. చివర్లో  30 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లి భారీ సిక్సర్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాథ్యూస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.

 స్కోరు వివరాలు: శ్రీలంక ఇన్నింగ్స్: డిక్‌వెల్ల (సి) రాయుడు (బి) కులకర్ణి 4; దిల్షాన్ (బి) బిన్నీ 35; చండిమల్ (సి) రోహిత్ (బి) అక్షర్ 5; జయవర్ధనే (సి) రహానే (బి) అశ్విన్ 32; మ్యాథ్యూస్ నాటౌట్ 139; తిరిమన్నే (సి) రాయుడు (బి) అశ్విన్ 52; తిసారా పెరీరా (సి) జాదవ్ (బి) అక్షర్ 6; ప్రసన్న (బి) అక్షర్ (బి) కులకర్ణి 0; మెండిస్ (సి) కరణ్ (బి) కులకర్ణి 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 286
 వికెట్ల పతనం: 1-32; 2-45; 3-73; 4-85; 5-213; 6-258; 7-285; 8-286; బౌలింగ్: ధావల్ కులకర్ణి 8-0-57-3; బిన్నీ 8-1-28-1; అక్షర్ 10-0-45-2; అశ్విన్ 10-1-56-2; కరణ్ శర్మ 10-0-61-0; రాయుడు 4-0-33-0.

 భారత్ ఇన్నింగ్స్: రహానే (బి) మ్యాథ్యూస్ 2; రోహిత్ (బి) మ్యాథ్యూస్ 9; రాయుడు రనౌట్ 59; కోహ్లి నాటౌట్ 139; ఉతప్ప (సి) మ్యాథ్యూస్ (బి) మెండిస్ 19; జాదవ్ (బి) మెండిస్ 20; బిన్నీ (స్టంప్డ్) చండిమల్ (బి) మెండిస్ 12; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) మెండిస్ 0; అక్షర్ పటేల్ నాటౌట్ 17; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (48.4 ఓవర్లలో 7 వికెట్లకు) 288

 వికెట్ల పతనం: 1-6; 2-14; 3-150; 4-180; 5-215; 6-231; 7-231; బౌలింగ్: మ్యాథ్యూస్ 7-1-33-2; గమగే 4-0-25-0; ఎరంగా 7-0-45-0; ప్రసన్న 10-0-42-0; పెరీరా 3-0-20-0; మెండిస్ 9.4-0-73-4; దిల్షాన్ 8-0-46-0.

 
 5 వన్డేల్లో అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లి (21) టాప్-5లోకి చేరాడు. సచిన్, పాంటింగ్, జయసూర్య, గంగూలీల తర్వాత గేల్, గిబ్స్‌తో కలిసి సమంగా నిలిచాడు.
 
 100 శ్రీలంకపై అన్ని ఫార్మాట్‌లలో కలిపి భారత్‌కు ఇది వందో విజయం.
 
 5 శ్రీలంకపై అన్ని ఫార్మాట్‌లలో కలిపి భారత్‌కు ఇది వందో విజయం.
 
 3 ఒకే వన్డేలో ఇరు జట్ల కెప్టెన్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి మాత్రమే.
 
 205 భారత్ తరఫున వన్డే ఆడిన 205వ క్రికెటర్  కేదార్ జాదవ్.
 
 4 కోహ్లి వరుసగా నాలుగేళ్లు (2011, 12, 13, 14) వన్డేల్లో వేయికి పైగా పరుగులు చేశాడు. గతంలో గంగూలీ (1997-00) మాత్రమే ఇలా చేయగలిగాడు. 2010లో కోహ్లి 995 పరుగులు చేశాడు.

>
మరిన్ని వార్తలు