ఫించ్, బెయిలీలపై వేటు

7 Jan, 2017 15:49 IST|Sakshi
ఫించ్, బెయిలీలపై వేటు

మెల్బోర్న్:త్వరలో పాకిస్తాన్ తో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు నుంచి స్టార్ ఆటగాళ్లు ఆరోన్ పింఛ్, జార్జ్ బెయిలీలను తొలగించారు. ఈ ఇద్దరికీ ఆసీస్ వన్డే జట్టులో చోటు దక్కుతుందని తొలుత భావించినా.. అనూహ్యంగా వారిపై వేటు వేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది.

 

ప్రస్తుత ఆసీస్ జట్టులో యువ క్రికెటర్ల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో పింఛ్, బెయిలీలను తప్పించక తప్పలేదు. అయితే క్రిస్ లయన్ తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పిస్తూ సీఏ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో ఆకట్టుకోవడంతో క్రిస్ లయన్ కు అవకాశం దక్కింది.  ఈ మేరకు 15 సభ్యులతో కూడిన జట్టును ఆసీస్ శనివారం ప్రకటించింది.

ఆసీస్ వన్డే జట్టు స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖాజా, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, క్రిస్ లయన్, జేమ్స్ ఫల్కనర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూవేడ్, మిచెల్ స్టార్క్, హజల్ వుడ్, పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, బిలీ స్టాన్లేక్

మరిన్ని వార్తలు