ఫించ్‌ రిటైర్డ్‌ హర్ట్‌.. ఆసీస్‌కు షాక్‌

16 Dec, 2018 13:34 IST|Sakshi
ఆరోన్‌ ఫించ్‌

పెర్త్‌ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. మహ్మద్‌ షమీ వేసిన 13వ ఓవర్‌ తొలిబంతి.. ఫించ్‌ కుడి చూపుడు వేలుకు బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిలాడిన ఫించ్‌ మైదానం వీడాడు. అతన్ని ఎక్స్‌రే కోసం ఫిజియోలు ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రమైతే ఫించ్‌ సిరీస్‌ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్‌ ఓడిన కంగారులకు ఫించ్‌ గాయం కంగారుపెడుతోంది. 
 
ఇక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 283 పరుగులకు ముగియడంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌కు ఓపెనర్లు మంచిశుభారంభం అందించారు. ఫించ్‌(25) గాయంతో మైదానం వీడగా.. మరోఓపెనర్‌ హారిస్‌ (20)ను బుమ్రా బౌల్డ్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్ష్‌(5)ను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. 
 

మరిన్ని వార్తలు