ప్రాక్టీస్‌లో అబాట్

3 Dec, 2014 00:18 IST|Sakshi
ప్రాక్టీస్‌లో అబాట్

 సిడ్నీ: హ్యూస్ మరణానికి కారణమైన బంతిని విసిరిన పేసర్ సీన్ అబాట్ ఇప్పుడిప్పుడే ఆ విషాదంనుంచి కోలుకుంటున్నాడు. నేరుగా తన ప్రమేయం లేకపోయినా హ్యూస్ చనిపోవడంతో ఆ రోజునుంచి అబాట్ అపరాధ భావంతో కనిపించాడు. అయితే సహచర ఆస్ట్రేలియా క్రికెటర్లు, సన్నిహితులు అండగా నిలవడంతో కాస్త మామూలు స్థితికి వచ్చాడు. మంగళవారం తొలిసారి అతను మైదానంలోకి దిగాడు.
 
 22 ఏళ్ల అబాట్ న్యూసౌత్‌వేల్స్ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే అతను ఒంటరిగా ఉండకుండా సాధన సమయంలో జట్టు సభ్యులంతా అబాట్‌కు తోడుగా నిలిచారు. మరో వైపు అంత్యక్రియలకు అబాట్ రాక కోసం తామూ ఎదురు చూస్తున్నామని హ్యూస్ సన్నిహితులు వెల్లడించారు. ‘అతడిని గుండెలకు హత్తుకొని అంతా బాగుందని చెప్పాలని మేం భావిస్తున్నాం’ అని వారు అన్నారు.
 

మరిన్ని వార్తలు