అభిలాష ‘హ్యాట్రిక్‌’ టైటిల్స్‌

13 Aug, 2018 10:28 IST|Sakshi

 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కేన్స్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్లేయర్‌ ఎ. అభిలాష సత్తా చాటింది. యూసుఫ్‌గూడలోని కేవీబీఆర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అండర్‌–17, అండర్‌–19, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచి మూడు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం జరిగిన అండర్‌–17 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో అభిలాష 15–10, 15–8తో ఎం. తేజస్విని (ఎస్‌ఎస్‌)పై గెలుపొందింది. అండర్‌–19 విభాగంలో 15–6, 15–13తో డి. శ్రేయ (స్పార్ధ)ను ఓడించింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అభిలాష 15–11, 15–12తో కె. ప్రణాలి (ఎల్బీ స్టేడియం)పై గెలుపొంది హ్యాట్రిక్‌ టైటిళ్లను సొంతం చేసుకుంది.

మరోవైపు అండర్‌–13 బాలబాలికల విభాగంలో ఎస్‌. శ్రీరాగ్, కె. శ్రేష్టారెడ్డి చాంపియన్‌లుగా నిలిచారు. బాలుర సింగిల్స్‌ తుదిపోరులో శ్రీరాగ్‌ (ఫ్లయింగ్‌ లోటస్‌) 15–6, 15–7తో ఓంప్రకాశ్‌ రెడ్డి (కేన్స్‌)పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో ఎ. సాయి చతుర (ఎంఎన్‌సీ)పై కె. శ్రేష్టారెడ్డి విజయం సాధించింది. బాలుర డబుల్స్‌ ఫైనల్లో బి. జశ్వంత్‌ రామ్‌–కె. జై ఆదిత్య (కేన్స్‌) జంట 15–7, 15–12తో ఓంప్రకాశ్‌ రెడ్డి– శ్రీరాగ్‌ (ఫ్లయింగ్‌) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది.  

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు


 అండర్‌–13 బాలికల డబుల్స్‌: 1. కె. వెన్నెల–కె. రితిక (వీబీఏ), 2. సాయి చతుర–ఎ. చరిష్మా (వీబీఏ).
 అండర్‌–15 బాలుర సింగిల్స్‌: 1. ఎం. శశాంక్‌ (స్పార్ధ), 2. ధరణ్‌ కుమార్‌ (సీఏబీఏ).
 బాలుర డబుల్స్‌: 1. ధరణ్‌ కుమార్‌– పీవీఎస్‌ సుజ్‌వాల్‌ (సీఏబీఏ), 2. కె. ఉదయ్‌ తేజ్‌–శ్రవంత్‌ సూరి (సీఏబీఏ).
 బాలికల డబుల్స్‌: 1. డీవీ లయ–డీవీ శ్రుతి, 2. కె. వైష్ణవి– మృత్తిక షెనోయ్‌.
 అండర్‌–17 బాలుర సింగిల్స్‌: 1. ఎస్‌. సాయి పృథ్వీ, 2. బి. యశ్వంత్‌ రామ్‌.
 బాలుర డబుల్స్‌: 1. బి. నిఖిల్‌ రాజ్‌–మనీశ్‌ కుమార్, 2. లోకేశ్‌ రెడ్డి–కె. రోహిత్‌ రెడ్డి.
 బాలికల డబుల్స్‌: 1. డీవీ లయ–డీవీ శ్రుతి, 2. డి. అను సోఫియా–ఎస్‌. వైష్ణవి.
 అండర్‌–19 బాలుర సింగిల్స్‌: 1. కె. తరుణ్‌ రెడ్డి (కేన్స్‌), 2. బి. యశ్వంత్‌ (కేన్స్‌).
 బాలుర డబుల్స్‌: 1. కె. అనికేత్‌ రెడ్డి–సాయిపృథ్వీ (కేన్స్‌), 2. తరుణ్‌ రెడ్డి–మహితేజ (కేన్స్‌).
 బాలికల డబుల్స్‌: 1. కోమల్‌–లిఖిత, 2. బుష్రా ఫాతిమా–పూజిత.
 పురుషుల సింగిల్స్‌: 1. కె. అనికేత్‌ రెడ్డి (కేన్స్‌), 2. కె. తరుణ్‌ రెడ్డి (కేన్స్‌).
 పురుషుల డబుల్స్‌: 1. మజర్‌ అలీ–విఘ్నేశ్వర్‌ రావు, 2. హర్ష–సాయి గౌడ్‌.
 మహిళల డబుల్స్‌: 1. కె. ప్రణాలి (ఎల్‌బీఎస్‌)–చక్ర యుక్తారెడ్డి (కేన్స్‌), 2. పూర్వి సింగ్‌–కె. ప్రణాలి రెడ్డి (వీబీఏ).
 35+ పురుషుల సింగిల్స్‌: 1. ఆర్‌. శేషు సాయి, 2. వీవీవీ ప్రసాద్‌.
 35+ పురుషుల డబుల్స్‌: 1. ఆర్‌. శేషు సాయి–జి. హరీశ్‌ (మధురానగర్‌), 2. వీవీవీ ప్రసాద్‌– వినోద్‌ కుమార్‌ (ఆర్‌ఆర్‌ స్పోర్ట్స్‌).
 45+ పురుషుల సింగిల్స్‌: 1. నాగ రవి శంకర్‌ (మధురానగర్‌), 2. సి. రవి (మధురా నగర్‌).
 55+ పురుషుల సింగిల్స్‌: 1. ప్రకాశ్, 2. అంబ్రోస్‌.
 పురుషుల డబుల్స్‌: 1. పున్నారెడ్డి–రవీందర్‌ రెడ్డి (ఎర్రమంజిల్‌), 2. ప్రకాశ్‌ (ఎల్‌బీఎస్‌)–ఆంబ్రోస్‌ (ఎస్‌సీ క్లబ్‌).   

మరిన్ని వార్తలు