అభ్యాస స్కూల్ ముందంజ

20 Aug, 2016 12:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బాలికల వాలీబాల్ టోర్నమెంట్‌లో అభ్యాస స్కూల్, షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్స్ ముందంజ వేశాయి. బషీర్‌బాగ్‌లోని షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం సీనియర్ బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో అభ్యాస స్కూల్ 25-19, 25-17తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై గెలుపొందగా... షేర్‌వుడ్ స్కూల్ 25-15, 25-17తో ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్‌ను ఓడించింది.

 

జూనియర్ బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌ల్లో షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్ 27-25, 25-11, 15-10తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ ఆన్స్ 25-13, 25-14తో రమాదేవి పబ్లిక్ స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ స్కూల్ 25-11, 25-11తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై, షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్ 25-23, 26-24తో  సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై విజయం సాధించాయి.
 

మరిన్ని వార్తలు