టెస్టులే అసలైన క్రికెట్

16 Nov, 2016 23:43 IST|Sakshi
టెస్టులే అసలైన క్రికెట్

ఆరేళ్ల కష్టానికి ఫలితం టెస్టు హోదా
2019 ప్రపంచకప్ వరకూ ప్రణాళికఠ
బెంచ్ బలం పెంచడమే సెలక్టర్ల లక్ష్యం
‘సాక్షి’తో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ 

విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఇప్పుడు వెలిగిపోతోంది. బీసీసీఐలో ఏసీఏ అధికారులకు రకరకాల పదవులు... భారత చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్... కావలసినన్ని మ్యాచ్‌ల నిర్వహణ... తాజాగా టెస్టు హోదా... గత ఆరేళ్ల కాలంలో ఆంధ్ర క్రికెట్ చాలా మారిపోరుుంది. దీనిలో ఎమ్మెస్కే ప్రసాద్‌ది కీలక పాత్ర. ఏసీఏ క్రికెట్ ఆపరేషన్‌‌స డెరైక్టర్‌గా మైదానాలు, అకాడమీల నిర్మాణం, నిర్వహణలో ఆయన కీలకంగా వ్యవహరించారు. వైజాగ్ టెస్టు అరంగేట్రం సందర్భంగా టెస్టు హోదా, సెలక్టర్‌గా బాధ్యతలు, భారత జట్టు ప్రణాళికలు ఇలా వివిధ అంశాలపై ఎమ్మెస్కే ప్రసాద్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...

వైజాగ్‌కు టెస్టు హోదా: చాలా సంతోషంగా ఉంది. దీని కోసం మేం ఆరేళ్లుగా కలలుగంటున్నాం. ఆరేళ్ల పాటు కష్టపడ్డాం. ఆంధ్ర క్రికెట్ సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన మైదానాలు, అకాడమీలు బోర్డును ఆకట్టుకున్నారుు. ఇక్కడ అనేక శిబిరాలు ఏర్పాటు చేశాం. వీటన్నింటి వల్లే టెస్టు హోదా సాధ్యమైంది.

వన్డే ప్రపంచకప్ వరకు: సెలక్షన్ కమిటీ చైర్మన్ అవకాశం రావడం గొప్ప గౌరవం. ప్రస్తుత కమిటీ దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు వెళుతోంది. 2019 ప్రపంచకప్ వరకూ మాకు ప్రణాళికలు ఉన్నారుు. ఆలోగా భారత్ సుమారు 60 వన్డేలు ఆడుతుంది. వాటి ద్వారా ప్రపంచకప్ టోర్నీకి కూడా మంచి జట్టును తయారు చేస్తాం. ప్రతి విషయంలోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం.

టెస్టులకు కూడా: రాబోయే నాలుగేళ్ల కాలంలో టెస్టు మ్యాచ్‌లు కూడా బాగా ఉన్నారుు. దీని కోసం కూడా ప్రణాళికలు ఉన్నారుు. బీసీసీఐ టెస్టు క్రికెట్ కోసం అదనంగా నిధులు కేటారుుస్తోంది. ఈ ఫార్మా ట్ పట్ల బోర్డు అంకితభావంతో ఉంది. బోర్డుతో పాటు దేశంలో ప్రతి క్రికెటర్ కూడా టెస్టుల కోసం ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే టెస్టు క్రికెట్ అసలైన క్రికెట్ అనేది అందరి భావన. అదే నిజం కూడా.

సెలక్టర్ల బాధ్యత: భారత జట్టుతో పాటు సెలక్టర్లు ప్రయాణించడం అవసరం. విదేశాలకు జట్టుతో పాటు ఇద్దరు సెలక్టర్లు వెళుతున్నారు. స్వదేశంలో మ్యాచ్‌లకు ఒక సెలక్టర్ హాజరవుతున్నారు. మిగిలిన సెలక్టర్లు దేశవాళీ మ్యాచ్‌లను చూస్తున్నారు. భారత జట్టుకు బలమైన బెంచ్‌ను అందించడం మా ఉద్దేశం, బాధ్యత.

ప్రత్యామ్నాయాలు సిద్ధం: బలమైన బెంచ్ వల్ల జట్టులో ఏ ఆటగాడు లేకపోరుునా లోటు తెలియదు. లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్ గాయపడితే గంభీర్ వచ్చి ఆ లోటు తెలియకుండా ఆడాడు. ఇప్పుడు మళ్లీ రాహుల్ వచ్చాడు. ఇంకా ముకుంద్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తను కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

గంభీర్ స్థానంలో రాహుల్: తను గాయం తర్వాత కోలుకుని రంజీ మ్యాచ్ ఆడి ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అందుబాటులో రాగానే జట్టులోకి తీసుకున్నాం. భారత జట్టులోని 15 మంది సమర్థులే. అందులోంచి ఉత్తమ తుది జట్టును మేనేజ్‌మెంట్ ఎంచుకుంటుంది.

తుది జట్టు ఎంపికలో సెలక్టర్ల పాత్ర: టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు సెలక్టర్లు కూడా భాగం. గత ఏడాది నుంచి బీసీసీఐ దీనిని తప్పనిసరి చేసింది. మేనేజర్ నేతృత్వంలో కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్, సెలక్టర్ కలిసి తుది జట్టును ఎంపిక చేస్తున్నారు. సెలక్టర్లు, టీమ్ ఒకే మార్గంలో నడవడానికి వీలుగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకునే అంశాలు: ఫామ్, నైపుణ్యం, గత రికార్డు, భవిష్యత్‌లో జట్టు అవసరాలు, అన్నింటికి మించి ఏ స్లాట్ ఖాళీ ఉంది, ఏ స్లాట్‌లో ఆడగలడు అనే అంశాలన్నింటినీ పరిగణించిన తర్వాతే ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేస్తాం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా