చాంపియన్‌ ఆడమ్‌

27 Aug, 2019 14:03 IST|Sakshi

టెట్రాసాఫ్ట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: టెట్రాసాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌మాస్టర్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఉక్రెయిన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఆడమ్‌ టుఖెవ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. హోటల్‌ మారియట్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం ఆడమ్‌ (ఉక్రెయిన్‌) 8 పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల చివరిరోజు సోమవారం తొమ్మిదో రౌండ్‌ గేమ్‌లో ఇరాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ మసౌద్‌పై 44 ఎత్తుల్లో ఆడమ్‌ గెలుపొందాడు. సావ్‌చెంకో బోరిస్, అలెగ్జాండర్, ఖుసెన్‌ఖోజెవ్‌ ముహమ్మద్, కౌస్తుభ్, హరి మాధవన్‌ 7 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

ఇతర గేముల్లో తమిళనాడుకు చెందిన ముత్తయ్యపై కుశాగ్ర మోహన్‌ (తెలంగాణ, 6.5 పాయింట్లు), మొహమ్మద్‌ అనీస్‌ (తమిళనాడు, 5.5 పాయింట్లు)పై రాజా రిత్విక్‌ (తెలంగాణ, 6.5 పాయింట్లు), జేకే రాజు (తెలంగాణ, 5 పాయింట్లు)పై స్మిర్నోవ్‌ పావెల్‌ (రష్యా, 6 పాయింట్లు), కార్తీక్‌ సాయి (తెలంగాణ, 5 పాయింట్లు)పై రామకృష్ణ (ఆంధ్రా బ్యాంక్, 6 పాయింట్లు), శరత్‌ చంద్ర (తెలంగాణ, 5 పాయింట్లు)పై కిరణ్‌ మనీషా (ఎల్‌ఐసీ, 6 పాయింట్లు), భరత్‌ కుమార్‌ రెడ్డి (ఆంధ్రప్రదేశ్, 6 పాయింట్లు)పై సావ్‌చెంకో బోరిస్‌ (రష్యా, 7 పాయింట్లు), అతుల్‌ (మహారాష్ట్ర, 6 పాయింట్లు)పై ట్రియాపిస్కో అలెగ్జాండర్‌ (రష్యా, 7 పాయింట్లు), వాసెజ్‌ రోడ్రిగో (చిలీ, 5.5 పాయింట్లు)పై కౌస్తుభ్‌ (పశ్చిమ బెంగాల్, 7 పాయింట్లు) విజయం సాధించారు.  

మరిన్ని వార్తలు