ఓటమి దిశగా ఆఫ్ఘనిస్థాన్

26 Feb, 2015 10:14 IST|Sakshi

డునె డిన్: వన్డే వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. 23.4 ఓవర్లలో 97 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయిన ఆఫ్ఘన్లు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డారు. ఆదిలో ఆఫ్ఘన్లు బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఆ తరువాత వరుస వికెట్లను చేజార్చుకున్నారు.12 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోవడంతో ఆఫ్ఘన్లకు ఎదురు దెబ్బతగిలింది.

 

ఓపెనర్ నవ్రోజ్ మంగళ్(7) ,ఆష్ గర్ స్టాన్ క్జాయ్ (4) , జావెద్ అహ్మదీ(51),మహ్మద్ నబీ(1), అఫ్సర్ జజాయ్(0), నజిబుల్లా జర్దాన్(4), నయిబ్(0)లు పెవిలియన్ కు చేరారు.  అంతకుముందు స్కాట్లాండ్ 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు