రషీద్‌ ఖాన్‌కు ప్రమోషన్‌..

5 Apr, 2019 19:23 IST|Sakshi

కాబూల్‌ : అఫ్గనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు ఆ దేశ సెలక్షన్‌ కమిటీ పదోన్నతి కల్పించింది. ఇంగ్లండ్‌-వేల్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనబోయే అఫ్గాన్‌ జట్టుకు రషీద్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున రషీద్‌ ఖాన్‌ అదరగొడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం సమావేశమైన ఆఫ్గాన్‌ సెలక్షన్‌ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు ఫార్మట్‌లకు వేర్వేరు సారథులు ఉండాలని బోర్డు నిర్ణయించింది. అంతే కాకుండా ప్రపంచకప్‌లో పాల్గొనబోయే అఫ్గాన్‌ జట్టుకు ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న అస్గర్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో గుల్బాదిన్ నైబ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

ఇక ఇప్పటికే అఫ్గాన్‌ టీ20 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రషీద్‌ ఖాన్‌ను కొనసాగించింది. టెస్టులకు రహమ్‌త్‌ షాను కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌కు సన్నాహకంలో భాగంగా అఫ్గాన్‌ జట్టు ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది. ఇక ప్రపంచకప్‌ తొలి పోరులో ఆస్ట్రేలియాతో జూన్‌1న తలపడనుంది. తొలి సారి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొననుండటంతో అఫ్గాన్‌ ఆటగాళ్లు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

ఫైనల్లో పరాజితులు లేరు 

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన