భారత్‌ను ఢీకొట్టే అఫ్గాన్‌ జట్టు ఇదే

29 May, 2018 18:48 IST|Sakshi
అఫ్గాన్‌ ఆటగాళ్లు (ఫైల్‌ ఫొటో)

నలుగురు స్పిన్నర్లతో బరిలోకి

కాబుల్‌ : టీమిండియాతో జరిగే ఎకైక చారిత్రాత్మక టెస్టుకు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు 16 సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. నలుగురు స్పిన్నర్లకు తుది జట్టులో అవకాశం కల్పించింది. ఈ జట్టుకు అస్గార్‌ స్టానిక్‌జై సారథ్యం వహించనున్నాడు. బెంగళూరు వేదికగా జూన్‌ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ టెస్టుల్లో అఫ్గాన్‌కు అరంగేట్ర మ్యాచ్‌ అన్న విషయం తెలిసిందే. మణికట్టు స్పిన్నర్లు రషీద్‌ ఖాన్‌, జహీర్‌ఖాన్‌లతో పాటు ముజీబ్‌ఉర్‌ రెహ్మాన్‌, అమీర్‌ హమ్జాలకు చోటు దక్కింది.

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో రషీద్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మణికట్టు స్పిన్నరైన జహీర్‌ ఖన్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసినప్పటికి వేలి గాయంతో అతను టోర్నీకి దూరమయ్యాడు. ఇక జహీర్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ టోర్నీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సన్‌రైజర్స్‌ తరపున అద్బుతంగా రాణించిన రషీద్‌ ఖాన్‌ భారత బ్యాట్స్‌మన్‌కు ఇబ్బంది కానున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ను లైట్‌ తీసుకున్న బీసీసీఐ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతినిచ్చింది. భారత జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.
 

అఫ్గానిస్తాన్‌: అస్గార్‌ స్టానిక్‌ జై (కెప్టెన్‌), జావెద్‌ అహ్మద్‌, ఇషానుల్లా, మహ్మద్‌ షాహజాద్‌ (వికెట్‌ కీపర్‌), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నాసిర్‌ జమాల్‌, రహమత్‌ షా, హస్మతుల్లా షాహిదీ, అఫ్సార్‌ జాజై, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, అమీర్‌ హమ్జా, సయ్యద్‌ షిర్జాద్‌, యామిన్‌ అహ్మద్‌జై, వాఫదార్‌, జహీర్‌ఖాన్‌

చదవండి : ఏకైక టెస్టుకు  భారత జట్టు ప్రకటన

మరిన్ని వార్తలు