అఫ్గానిస్తాన్‌ ' అతిపెద్ద' విజయం

10 Feb, 2018 17:13 IST|Sakshi
స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు సహచరుల అభినందనలు

షార్జా: తమ వన్డే క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్‌ 154 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తద్వారా తన వన్డే క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని అఫ్గాన్‌ సొంతం చేసుకుంది..

తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్‌ ఆటగాళ్లలో రహ్మత్‌ షా(114;110 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్‌(81 నాటౌట్‌; 51 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఇస్మానుల్లా జనాత్‌(54; 53 బంతుల్లో 9 ఫోర్లు)లు రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది.  కాగా, ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే  34.4 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లతో జింబాబ్వే నడ్డివిరిచాడు. అతనికి జతగా జద్రాన్‌ రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంచితే, అఫ్గాన్‌కు వన్డేల్లో రెండో అతిపెద్ద స్కోరు. అంతకుముందు ఐర్లాండ్‌పై 338 పరుగులు అఫ్గాన్‌ వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు.

మరిన్ని వార్తలు