అఫ్గాన్‌దే టి20 సిరీస్‌

18 Nov, 2019 05:43 IST|Sakshi

లక్నో: వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌ 2–1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి టి20లో అఫ్గాన్‌ 29 పరుగుల తేడాతో విండీస్‌పై నెగ్గింది. తొలుత అఫ్గాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల కు 158 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రహ్మానుల్లా (52 బంతుల్లో 79; 6 ఫోర్లు,  5 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అనం తరం ఛేదనకు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసింది. షై హోప్‌ (46 బంతుల్లో 52; 3 ఫోర్లు, సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. నవీన్‌ హుల్‌ హక్‌ (3/24) ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా