బంగ్లాదేశ్‌ను నిలువరించేనా?

24 Jun, 2019 14:45 IST|Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిని అఫ్గాన్‌ కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ ముందుగా బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కావడంతో ఆ జట్టు ఐదు పాయింట్లతో ఉంది. ఇక అఫ్గానిస్తాన్‌ ఇప్పటికే ఇంటి ముఖం పట్టింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది.( ఇక్కడ చదవండి: మేం మునిగాం.. బంగ్లానూ ముంచుతాం)

ఇదిలా ఉంచితే, ఇరు జట్లు 7 సార్లు వన్డేల్లో తలపడగా, 4 సార్లు బంగ్లాదేశ్‌ గెలిచింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌ విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఒకసారి మాత్రమే ముఖాముఖి పోరులో తలపడ్డాయి. అందులో బంగ్లాదేశ్‌ గెలుపొందింది. 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ 105 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అఫ్గాన్‌ భావిస్తోంది. బంగ్లాదేశ్‌కు షాకిచ్చి టోర్నీలో బోణీ కొట్టడానికి అఫ్గాన్‌ సిద్ధమైంది. మరొకవైపు అఫ్గాన్‌పై గెలిచి సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని బంగ్లాదేశ్‌ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!