ఆ క్రికెటర్‌కూ బ్రెయిన్‌ ఫేడ్‌ అయింది

29 Oct, 2017 09:31 IST|Sakshi

సిడ్నీ : స్టీవ్‌ స్మిత్‌ కంటే ముందే మరో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ బ్రెయిన్‌ ఫేడ్‌కు గురయ్యాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన రెండు మ్యాచ్‌ల (విక్టోరియా-వెస్టర్న్‌ ఆస్ట్రేలియా, విక్టోరియా-క్వీన్స్‌లాండ్‌ జట్ల మధ్య) సందర్భంగా ఫవాద్‌ అహ్మద్‌ బ్రెయిన్‌ ఫేడ్‌కు గురైనట్లు సోషల్‌మీడియాలో ఓ వార్త సర్కిల్‌ అవుతోంది.

బ్యాటింగ్‌కు మైదానంలోకి వెళ్తూ ఒకే చేతి గ్లౌజ్‌లను తీసుకెళ్లిన అహ్మద్‌, వెనక్కు వచ్చి సహచరులతో సరైన గ్లౌజ్‌ సెట్‌ను తెప్పించుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది. మరో మ్యాచ్‌లో బ్యాట్‌ తీసుకెళ్లడం మర్చిపోయాడు ఫవాద్‌. తన మతిమరుపునకు తనను తాను తిట్టికున్న ఫవాద్‌.. బ్యాట్‌తో తలను కొట్టుకున్నాడు కూడా. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ భారత్‌తో మ్యాచ్‌లో తనకు బ్రెయిన్‌ ఫేడ్‌ అయిందని చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు