అజయ్ శర్మకు క్లీన్‌చిట్

6 Sep, 2014 00:37 IST|Sakshi

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టివేసిన జిల్లా కోర్టు
న్యూఢిల్లీ: దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఢిల్లీ మాజీ కెప్టెన్ అజయ్ శర్మకు మ్యాచ్ ఫిక్సింగ్ కేసు నుంచి ఉపశమనం లభించింది. అతనిపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను జిల్లా కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పు సంతృప్తినిచ్చిందని చెప్పిన శర్మ ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానన్నాడు. ‘గత 14 ఏళ్లు నా జీవితంలో ఓ కఠిన దశ. నేను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు నమ్మింది. నాకు ఎవరిపై కోపం లేదు.
 
  ఫస్ట్ క్లాస్ కెరీర్ అర్ధంతరంగా ముగిసినందుకు బాధపడడం లేదు. గతాన్ని మరచి ముందుకు సాగాలని కోరుకుంటున్నా. రంజీ, ఇతర దేశవాళీ టోర్నీల్లో నా కుమారుడు మన్నన్ శర్మ ఆడుతుంటే చూడాలని ఉంది. ఢిల్లీ క్రికెట్‌కు అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని 50 ఏళ్ల శర్మ పేర్కొన్నాడు. ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడినందున బోర్డు నుంచి రావాల్సిన బకాయిలను బీసీసీఐ చెల్లిస్తే బాగుంటుందన్నాడు. 2000వ సంవత్సరంలో మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అజయ్‌శర్మపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.
 

>
మరిన్ని వార్తలు