ఎన్‌బీఏ శిక్షణకు ఆశయ్ వర్మ

10 Feb, 2017 10:22 IST|Sakshi

ముంబై: ప్రతిభ ఉంటే సరిహద్దులైనా దాటేయొచ్చని హైదరాబాద్ కుర్రాడు ఆశయ్ వర్మ తన ఎంపికతో నిరూపించాడు. ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) అంతర్జాతీయ గ్రూప్‌నకు 17 ఏళ్ల ఆశయ్ ఎంపికయ్యాడు. ఇతనితో పాటు కేరళకు చెందిన ప్రియాంక ప్రభాకర కూడా 67 మంది సభ్యుల బాలబాలికల గ్రూప్‌నకు ఎంపికై ంది. ఆశయ్‌కి హైటే అడ్వాంటేజ్ అరుు్యంది. 7 అడుగుల 1 అంగుళం ఎత్తున్న వర్మ అమెరికాలో నిర్వహించే శిక్షణ శిబిరానికి అర్హత సంపాదించాడు.

 

హైదరాబాద్‌లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి అరుున ఆశయ్ ఈ అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా బాస్కెట్‌బాల్‌లో సత్తాచాటేవారిని ఎంపిక చేసి వీరికి మూడు రోజుల పాటు అమెరికాలోని న్యూ ఓర్లియాన్‌‌సలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే ఈ ప్రత్యేక శిబిరంలో అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ స్టార్లతో కలిసి పాల్గొనే అవకాశాన్ని ఇస్తారు.

మరిన్ని వార్తలు