‘మ్యూజిక్‌ ఇష్టం.. వంట నేర్చుకుంటున్నాను’  

29 Feb, 2020 19:47 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే మృదుస్వభావి, వివాదరహితుడు. క్రికెట్‌పై అతడికున్న ఆసక్తి, ఇష్టం, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రెటీల జీవితం ఎప్పుడూ పబ్లికే.. కానీ రహానే మాత్రం పర్సనల్‌ లైఫ్‌ను చాలా గోప్యంగా ఉంచుతాడు. అయితే తొలిసారి తన ప్రయివేట్‌ లైఫ్‌ గురించి అనేక అసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రహానే తన భార్య రాధిక, తండ్రి బాధ్యతల గురించి పలు అంశాలను అభిమానులతో పంచుకున్నాడు. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా అదృష్టమని, తన లైఫ్‌తో ఈ విషయం రుజువైందని పేర్కొన్నాడు. ఇక టెస్టు మ్యాచ్‌లు ముగియగానే నేరుగా ఇంటికి వెళ్లి తన కూతురుతో సరదాగా గడుపుతానని పేర్కొన్నాడు. 

‘వరుస క్రికెట్‌ టోర్నీలు, ప్రాక్టీస్‌ సెషన్స్‌, విదేశీ టూర్‌లతో ఎక్కువగా ఇంటికి దూరంగానే ఉంటాను. దీంతో నా భార్య (రాధిక), కూతురుతో సరదాగా గడపడానికి సమయం దొరకదు. అయితే నేను దేనికి ఎక్కువ ప్రాధన్యత ఇస్తాను, నా ప్యాశన్‌ ఏంటో రాధికకు బాగా తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా అదృష్టం. ఆమెకు లైమ్‌లైట్‌లోకి రావడం ఇష్టం ఉండదు. అందుకే అమె గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. అయితే ఆటలో నేను ఆలసిపోయినప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా తనను బయటకు తీసుకెళ్లడం, షాపింగ్‌ చేయడం, డిన్నరం చేయడం వంటివి చేస్తుంటాం. ఇక క్రికెట్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా వెంటనే ఇంట్లో వాలిపోతాను. ఆ సమయంలో పాప విషయంలో రాధికకు ఫుల్‌ రెస్ట్‌ ఇస్తాను. పాపకు సంబంధించి అన్ని విషయాలు, పనులను నేనే చూసుకుంటాను

ఇప్పటికీ గుర్తే.. గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో టెస్టు జరుగుతున్నప్పుడు నాకు పాప పుట్టింది. టెస్టు ముగిసిన వెంటనే పాపను చూడటానికి ఆసుపత్రి వెళ్లాను. తనను నా రెండు చేతుల్లోకి తీసుకోవడం, లాలించిన క్షణాలు ఇంకా గుర్తే ఉన్నాయి. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక నా భార్యకు తగిన సమయం ఇవ్వాడంతో పాటు నా పాపకు మంచి విద్యను అందించాలనుకుంటున్నాను. నాకు సంగీతం అంటే ఇష్టం. నేను మంచి భోజన ప్రియుడుని. ఖాళీ సమయాలల్లో నా భార్య దగ్గర వంట నేర్చుకుంటాను. కొన్ని డిషెస్‌లు మాత్రమే పర్ఫెక్ట్‌గా చేయగలను. ప్రపంచకప్‌ అనేది నా కల. ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో నేను సభ్యుడిగా ఉండాలనేది నా కోరిక. ఆటలో సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌లే నాకు ప్రేరణ. ఆటేతర విషయాల్లో నా తండ్రే నాకు స్పూర్థి.’అంటూ రహానే వివరించాడు.

చదవండి:
క్రిస్‌ లిన్‌ నెత్తిపై పొగలు
వాటే డైవ్‌.. పిచ్చెక్కించావ్‌ కదా!

>
మరిన్ని వార్తలు